'మట్కా' కథను 'వాడిపోయిన పువ్వులు' అనే షార్ట్‌ స్టోరీగా రాయాలనుకున్నాను: కరుణ్‌కుమార్‌

Entertainment
Advertisement
మెగా కాంపౌండ్‌ హీరో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. 'పలాస' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న కరుణ్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం  ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది ?
-మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో పడింది. మా అత్తగారిది వైజాగ్. ఓ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. మా వైఫ్ తరఫున బంధువుల్లో ఒక అతను పంటర్ గా పని చేశాడు. ఏజెంట్స్ లా అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం ఈ మట్కా గేమ్ గురించి విన్నాను. ఆ మాటల సందర్భంలో వైజాగ్ లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నాను. నేనెప్పుడూ వైజాగ్ వెళ్ళినా జగదాంబతో ఆగిపోయావడిని. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్ తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిది అనేది పరిశోధించడం మొదలుపెట్టాను. ఒక కథకుడిగా దీన్ని 'వాడిపోయిన పువ్వులు' పేరుతో ఒక షార్ట్ స్టోరీ గా రాయాలనుకున్నాను. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది. అప్పుడు ఒక ట్రీట్మెంట్ వెర్షన్ రాసుకున్నాను. అది ఫస్ట్ డ్రాఫ్ట్. ఈరోజు చూస్తున్నది 12 డ్రాఫ్ట్.

ఇందులో మీ మార్క్ చెప్పడానికి స్కోప్ దొరికిందా?
-మన దగ్గర అద్భుతమైన కథలు, సాహిత్యం వుంది. మనం తీసినన్నీ గొప్ప సినిమాలు ఎవరూ తీయలేదు. 'మాలపిల్ల' అనే సినిమా అందరికంటే ముందు మనం తీశాం. గొప్ప సాహిత్యం, కథలు, కల్చర్ వున్న తెలుగు నేల మనది. తమిళం, మలయాళం కంటే సూపర్ రూటెడ్ కథలు మనదగ్గర వున్నాయి. 'మట్కా' నా స్టయిల్ అఫ్ స్టొరీ టెల్లింగ్ తో ఒక కథని అందరినీ అలరించేలా చెప్పేలానే వుంటుంది. మట్కా పక్కా కమర్షియల్ సినిమా. చాలా స్టయిలీష్ ఫిల్మ్ మేకింగ్ లో చేసిన సినిమా.

మట్కా కథని చాలా పెద్ద కాన్వాస్ లో చైల్డ్ వుడ్ నుంచి చెప్పడానికి కారణం ?
-ఇది ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు బర్మా నుంచి వైజాగ్ కి ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్ లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అప్పటి వైజాగ్ వెనుక ఉన్న క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ ఇవన్నీ కథలో భాగమే.

మట్కా గురించి ఇప్పుడు జనరేషన్స్ కి చాలామందికి తెలియదు కదా..అది తెలియజేసేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
-సినిమా చూడండి. 100% మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఆ సీన్లన్నీ తీయడం జరిగింది. మట్కా ఎలా వచ్చింది.. దాన్ని ఎలా కొనసాగించారు? ఇవన్నీ చాలా క్లియర్ గా మీకు అర్థం అవుతాయి. సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని పంపించడం అనేది ఈ కథలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నిజంగా అది ఎలా జరిగిందో ఇప్పటికి నాకు తెలియదు. ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయివుంటే ఏం చేసేవాడిని అని తనలా ఆలోచించి ఆ ఐడియాస్ తో ఈ స్క్రిప్ట్ ని చేశాను.

వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ గారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు?
-ఇప్పుడే సినిమాని లాక్ చేసుకుని వచ్చాను. ఇది వరుణ్ తేజ్ గారి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్. 20 ఏళ్ల తర్వాత కూడా మట్కానే ప్రస్తావిస్తారు. వరుణ్ గారు చాలా కూల్ పర్శన్. చాలా డెడికేషన్ తో వర్క్ చేశారు.

మట్కా కోసం రతన్ ఖత్రి జీవితాన్ని ఎంతలా తీసుకున్నారు?
-ఇందులో రతన్ ఖత్రి గారి జీవితాన్ని తీసుకోలేదు. ఆయన కథని ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ గా తీరుస్తున్నారు. అది వెబ్ సిరిస్ గానే తీయాలి. సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఇందులో ఒకటే సిమిలారిటీ ఏంటంటే.. రతన్ ఖత్రి పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. ఇందులో వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. అంతే. వైజాగ్ లో బర్మా కాలనీ వుండేది. అందులో రకరకాల మనుషులు వుండేవారు.  

ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? అనుకున్న బడ్జెట్ లోనే తీశారా?
-79 రోజులు షూటింగ్ చేశాం. ఇప్పటివరకు నేను అన్ని సినిమాల్ని అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశాను. ఈ సినిమాను కూడా అనుకున్న బడ్జెట్ లోనే కంప్లీట్ చేశాం.

మీరు చిరంజీవి గారికి అభిమాని కదా..  వరుణ్  తేజ్ లుక్స్ విషయంలో ఆయన రిఫరెన్స్ లు తీసుకున్నారా?
-చిరంజీవి గారి రిఫరెన్స్ లు లేకుండా ఎలా తీస్తాను(నవ్వుతూ).  చిరంజీవి గారి రిఫరెన్స్ వుంది.
Advertisement
Karuna kumarMatkaKaruna kumar interviewVarun Tej

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News