యూనివర్శల్‌గా 'గేమ్‌ ఛేంజర్‌' అందరినీ మెప్పిస్తుంది: దిల్‌ రాజు

Entertainment
Advertisement
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న  మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 9న ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత‌లు దిల్‌రాజు, ఆదిత్య రామ్‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘నా 21 ఏళ్ల ప్ర‌యాణంలో నిర్మాత‌గా ‘గేమ్ చేంజ‌ర్‌’ నా 50వ సినిమా. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. మూడేళ్ల క్రితం శంక‌ర్‌గారు ఈ సినిమా స్టోరీ లైన్ నాకు చెప్ప‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. ఆదిత్య‌రామ్‌గారు నాకు మంచి స్నేహితుడు. ఆయ‌న ఇది వ‌ర‌కే తెలుగు సినిమాల‌ను కూడా నిర్మించారు. త‌ర్వాత ఆయ‌న చెన్నైలో రియ‌ల్ ఎస్టేట్ చేస్తూ బిజీగా ఉండిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న్ని క‌లిసిన‌ప్పుడు నేను గేమ్ చేంజ‌ర్ మూవీని చేస్తున్నాన‌ని చెప్పగా, ఆదిత్య రామ్ కూడా ఇన్‌స్పైర్ అయ్యి ఇద్ద‌రం క‌లిసి చేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాం. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాతో పాటు, మ‌రికొన్ని తమిళ సినిమాల‌ను, పాన్ ఇండియా సినిమాల‌ను కూడా మేం నిర్మించ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. 

వారిసు సినిమా త‌ర్వాత నేను త‌మిళంలో ఇంకా సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. న‌వంబ‌ర్ 9న గేమ్ చేంజ‌ర్ టీజ‌ర్‌ను ల‌క్నోలో విడుద‌ల చేయ‌బోతున్నాం. త‌ర్వాత యు.ఎస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. త‌ర్వాత చెన్నైలో ఓ ఈవెంట్ చేస్తున్నాం. జ‌న‌వ‌రి తొలి వారంలో ఏపీ, తెలంగాణ‌ల్లో ఈవెంట్స్ నిర్వ‌హిస్తాం. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి స్పెష‌ల్‌గా గేమ్ చేంజ‌ర్ సినిమాను రిలీజ్ చేస్తాం. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాం. యూనివ‌ర్స‌ల్‌గా గేమ్ చేంజ‌ర్ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది. శంక‌ర్ గారి సినిమాలంటేనే స్పెష‌ల్‌గా ఉంటాయి. సాంగ్స్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా సినిమాలో ఉంటుంది.. అవ‌న్నీ గేమ్ చేంజ‌ర్ మూవీలో ఉంటాయి. ట్రిపులార్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌గారు గ్లోబ‌ల్ స్టార్ అయ్యారు. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న సినిమా గేమ్ చేంజ‌ర్‌. కియారా అద్వానీ హీరోయిన్‌. ఎస్‌.జె.సూర్య‌గారు కీ రోల్ చేశారు. త‌మ‌న్ ఫెంటాస్టిక్ సాంగ్స్ అందించారు’’ అన్నారు. 

ఆదిత్య రామ్ మాట్లాడుతూ ‘‘నేను సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకుని 10 సంవత్సరాలకు పైగానే అయ్యింది. దిల్‌రాజుగారితో క‌లిసి ఈ రోజు మీ ముందుకు వ‌చ్చాను. నేను ఆదిత్య‌రామ్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాలుగు సినిమాలు చేశాను. ప్ర‌భాస్‌గారితో ఏక్ నిరంజ‌న్ సినిమా నిర్మించిన త‌ర్వాత బ్రేక్ తీసుకున్నాను. రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టేశాను. అందువ‌ల్ల బ్రేక్ వ‌చ్చింది. ఇప్పుడు గేమ్ చేంజ‌ర్ సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఎస్‌వీసీతో క‌లిసి ఆదిత్య‌రామ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో విడుద‌ల చేస్తుంది. అలాగే మా కాంబినేష‌న్‌లో త‌మిళంతో పాటు పాన్ ఇండియా సినిమాల‌ను కూడా నిర్మించ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. మంచి క‌థ‌లు, డైరెక్ట‌ర్స్ తో మంచి సినిమాలు చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. దిల్‌రాజుగారి విష‌యానికి వ‌స్తే మంచి క‌థ‌ను సెల‌క్ట్ చేసుకుని, స్క్రిప్ట్‌ను గొప్ప‌గా సిద్ధం చేసి, కొత్త ద‌ర్శ‌కుడిని ఎంచుకుని సినిమా చేస్తారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎక్కువ సంఖ్య‌లో బ్లాక్ బ‌స్ట‌ర్స్‌, హిట్ సినిమాలు చేసిన నిర్మాత దిల్‌రాజుగారు. ఆయ‌న‌తో క‌లిసి స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌ను నిర్మిస్తాన‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను’’ అన్నారు.
Advertisement
Game changerDil RajuRamcharan

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News