రహస్యం ఇదం జగత్‌ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది!

Entertainment
Advertisement
రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సైన్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ ట్రైలర్‌కు ప్రముఖ రచయిత విజయేంద్రపసాద్‌తో పాటు హీరో సుధీర్‌బాబు తదితరలు ప్రశంసలు కురిపించారు. కాగా ఈ చిత్రం కథానాయికలు స్రవంతి ప్రత్తిపాటి, మాసస వీణలు ఆదివారం పాత్రికేయులతో ముచ్చటించారు ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఆస్తక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మానస వీణ మాట్లాడుతూ '' ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్‌లో శిక్షణ పొందాను. చాలా ఫార్ట్‌ ఫిలిమ్స్‌, హాలీవుడ్‌ వెబ్‌సీరిస్‌లు చేశాను. యూఎస్‌లోనే నేను వుంటాను. ఇది నా తొలి ఫీచర్‌ ఫిలిం. ఈచిత్రం అడిషన్స్‌ వెళ్లాను. నన్ను అడిషన్‌ చేసిన తరువాత ఈ చిత్రంలో అరుణి ఆచార్య అనే పాత్రకు సెలక్ట్‌ చేశాను. ఈ పాత్ర నాకు పర్సనల్‌గా కూడా ఎంతో నచ్చింది.  ముఖ్యంగా ఈ కథ వినగానే సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలజీని కనెక్ట్‌ చేసి టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో సినిమా నేపథ్యం వుండటం నన్ను ఆకర్షించింది. నాకు చిన్నప్పటి నుండి హారిపోటర్‌ కథలు విన్నాను. రామాయాణ, మహాభారతంలు కూడా చదివాను. ఈ చిత్రంలో నా పాత్ర కోసం నేను రీసెర్చ్‌ కూడా చేశాను. మా తాత గారు అలీ బాబు నలభై దొంగలు అనే సినిమాను నిర్మించారు. అలా నాకు కాస్త సినిమా నేపథ్యం కూడా వుంది. 
దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ సినిమా పట్ల ఎంతో పాషన్‌ వున్న వ్యక్తి. ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. తప్పకుండా ఈ చిత్రం కోమల్‌ దర్శకత్వ ప్రతిభను నిరూపిస్తుంది. భవిష్యత్‌లో ఆయన నుండి మరిన్నిమంచి సినిమాలు ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం యూఎస్‌లోనే జరిగింది. చిత్రీకరణ సమయంలో ఎన్నో ఛాలెంజ్‌లను ఫేస్‌ చేశాం.అమెరికాలో ఫుల్‌టైమ్‌ పనిచేస్తూ  సినిమా పట్ల పాషన్‌ వున్న యూఎస్‌లో వున్న వాళ్లకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి  కృతజ్క్షతలు. అందరం ఎంతో తపనతో చేసిన సినిమా ఇది. తప్పకుండా మీరందరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం వుంది' అన్నారు. 

స్రవంతి ప్రత్తిపాటి మాట్లాడుతూ '' రాజమండ్రిలో పుట్టి పెరిగిన నా విద్యాభ్యాసం మాత్రం అమెరికాలో జరిగింది. ప్రస్తుతం అక్కడే జాబ్‌ చేస్తూ వుంటున్నాను. కొన్ని హాలీవుడ్‌ ఫిలింస్‌లో కూడా నటించాను. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు యూఎస్‌లో తీస్తున్న ఓ తెలుగు సినిమాలో అవకాశం రావడం ఎంతో సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యాను. నేను బేసిక్‌గా థియేటర్‌ ఆర్టిస్ట్‌ను. చాలా స్టేజీషోలు నాటకాలు వేశాను. యాక్టింగ్ మెథడ్‌ అనే కోర్సును కూడా చేశాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు అకిరా. తప్పకుండా నా పాత్ర అందరికి నచ్చతుందనే నమ్మకం వుంది. అమెరికాలో జాబ్‌ చేస్తున్న నేను ఈ సినిమా నుండి పూర్తి స్థాయిలో సినిమాలపై శ్రద్ద పెట్టాను. ప్రముఖ రచయిత విజయేంద్ర పసాద్‌ నాకు తాత వరుస అవుతాడు. ఆయన సలహాలు సూచనలు నా కెరీర్‌ కోసం తీసుకున్నాను. ఈ చిత్ర కాన్సెప్ట్‌తో పాటు ట్రైలర్‌ కూడా నచ్చింది. హనుమంతుడు వేరే లోకలకు ట్రావెల్‌ చేసినప్పుడు అసలు జరిగిందేమిటి అనేది కథలో టైమ్‌ ట్రావెల్‌లో ఏం జరిగింది కూడా ఈ కథలో చర్చకు వచ్చింది. ఈ చిత్రం కోసం దర్శకుడు కోమల్‌ ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రం కోసం చాలా ఛాలెంజ్‌లు ఫేస్‌ చేశాం. చిత్రీకరణ సమయంలో యూఎస్‌లో సడెన్‌గా మంచు కురవడం,సడన్‌ ఎండ, ఎన్నో ఛాలెంజ్‌లు చూశాం. అమెరికాలోని అడవుల్లో చిత్రీకరణ చేశాం. చాలా రిస్కీ ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. తప్పకుండా ఈచిత్రం నటిగా నాతో పాటు అందరికి మంచి పేరును తీసుకొస్తుంది. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్ముతున్నాను. 
Advertisement
Rahasyam idam jagathManasa VeenaSravanthi Prattipati

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News