సిరిసిల్లలో జీ తెలుగు తారల సందడి 'సీతారాముల నిండు నూరేళ్ల సావాసం', ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు!

Entertainment
Advertisement
హైదరాబాద్, 30 అక్టోబర్ 2024: నిరంతరం ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు తాజాగా సిరిసిల్ల వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సీరియల్స్ సీతే రాముడి కట్నం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులతోపాటు ఇతర తారలు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ పేరున  ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమం ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!
జీ తెలుగు ఇటీవల సిరిసిల్లలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. ప్రముఖ యాంకర్ లాస్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న 'సీతే రాముడి కట్నం', 'నిండు నూరేళ్ల సావాసం' నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించడమే కాకుండా పలు బహుమతులను కూడా పంచి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. సీతే రాముడి కట్నం జోడీ సీత (వైష్ణవి)- రామ్ (సమీర్), & మహాలక్ష్మి (మంజుల పరిటాల) నిండు నూరేళ్ల సావాసం అమరేంద్ర (రిచర్డ్ జోస్)- అరుంధతి (పల్లవి గౌడ), అమరేంద్ర (రిచర్డ్ జోస్)- భాగమతి (నిసర్గ) తెరమీదనే కాదు తెర వెనక కూడా తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించి వినోదం పంచారు. 
జీ తెలుగు తారల సందడితో ఉత్సాహవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులతో పాటు జానపద గాయకుల పాటలు, డ్రామా జూనియర్స్ పిల్లల స్కిట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండు సీరియల్స్పై వచ్చిన సరదా మీమ్స్ ప్రదర్శిస్తూ సాగిన కామెంటరీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ‘అసలైన అమరేంద్ర ఎవరు?’ అంటూ సాగిన డ్రామా జూనియర్స్ స్కిట్ ఆసక్తికరంగా సాగింది. జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. నటీనటులు చెరగని అనుభూతులు పంచారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా మీరూ మిస్ కాకుండా చూసేయండి!
 
మన సిరిసిల్లలో జీ తెలుగు తారల సందడి.. 'సీతారాముల నిండు నూరేళ్ల సావాసం', ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు.. మీరూ తప్పకుండా చూడండి!
Advertisement
Tollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News