అమరన్‌ లాంటి సినిమా తీయాలంటే ఎంతో అంకితభావం కావాలి: దర్శకుడు నాగ్‌ అశ్విన్‌

Entertainment
Advertisement
తమిళ కథనాయకుడు  శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  కమల్ హాసన్, R. మహేంద్రన్,  నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  డైరెక్టర్ నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం హైదరబాద్‌లో జరిగింది. 

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ ..అమరన్‌ ఒక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా ట్రూ స్టోరీ. అమరన్  ఒక సోల్జర్.. లవ్ డ్యూటీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో డైరెక్టర్ రాజకుమార్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో నేను మేజర్ ముకుంద్ రోల్ చేశాను. ఇందుగా సాయి పల్లవి నటించింది. సాయి పల్లవి గారు ఎంత మంచి పెర్ఫార్మర్ అందరికీ తెలుసు. ఇందులో అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు ఇంటెన్స్ మ్యూజిక్ ఇచ్చారు.  కమల్ హసన్ గారు సినిమాని నిర్మించడంతో ఈ సినిమాని మరింత స్పెషల్ గా మార్చింది.  ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఈక్వల్య్ లవ్ ఎమోషన్ ఉంది. అక్టోబర్ 31 దీపావళి రోజున అందరూ థియేటర్స్ కి రండి. ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ.  మీలాంటి స్పెషల్ ఆడియన్స్ ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి రియల్ హీరో స్టోరీస్ ఇంకెన్నో వస్తాయి.  ప్లీజ్ సపోర్ట్ థిస్ ఫిలిం. లవ్ యు ఆల్.' అన్నారు

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..  అందరి సపోర్ట్ వల్లే కల్కి ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అమరన్ విషయానికొస్తే.. రెండు వారాలు ముందు సాయి పల్లవి ఇంట్రో  వీడియో చూశాను. అప్పుడే ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. ఇది చాలా వండర్ఫుల్ స్టోరీ . డైరెక్టర్ గారు చాలా క్లియర్ విజన్ తో ఉన్నారు. ఇలాంటి స్టోరీ చేయాలంటే చాలా ఫ్యాషన్ కావాలి . ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి రియల్ స్టోరీ చెప్పడం చాలా అవసరం. అలాంటి కథలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి.  కమల్ హాసన్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం వెరీ గ్రేట్.  ప్రొడక్షన్ క్వాలిటీ అద్భుతంగా కనిపిస్తుంది.  సాయి పల్లవి గారికి మీ అందరిలోనే నేను కూడా ఫ్యాన్ ని.  శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని.  ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.  చాలా డిఫరెంట్ రోల్స్  చేస్తుంటారు.  ఈ సినిమాకు చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  ఇలాంటి సినిమాలు చాలా మంది పీపుల్ కి కనెక్ట్ అవుతాయి. అందరికీ థాంక్యూ సో మచ్' అన్నారు. 

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ...  నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకి నచ్చాలని చాలా అంకితభావంతో పని చేస్తాను. అమరన్ సినిమాతో మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉంది. .  ఇది రియల్ సోల్జర్ జర్నీ.  రెండు రోజులు ముందు ఆర్మీ వాళ్లకి ఈ సినిమా చూపించినప్పుడు మా లైఫ్ కూడా ఇలాగే ఉందని వారు చెప్పారు. ఈ సినిమాని చాలా రియల్ గా చూపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది.  నా క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని మళ్ళీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ  తండేల్ సినిమాతో వస్తాను. అప్పుడు మరింత మాట్లాడదాం. నేను ఏ పాత్ర చేసిన ఎక్కడికి వెళ్లినా మీ ప్రేమ ఎప్పుడూ నాకు దొరుకుతుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను' అన్నారు

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ..  ఇది నేషనల్ వైడ్ గా సెలబ్రేట్ చేసుకునే సినిమా. తెలుగు ప్రేక్షకులు అందరికీ అమరన్ నచ్చుతుంది. శివ కార్తికేయన్ గారు చాలా అంకితభావంతో ఈ సినిమా చేశారు. సాయి పల్లవి ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటే అదొక అనుగ్రహం. చాలా వాల్యూ ఆడ్ అవుతుంది. కమల్ హాసన్ గారు వలనే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. చాలా మంచి హ్యూమన్ వాల్యూస్ ఎమోషన్ తో ఈ సినిమా చేశాం తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది' అన్నారు
Advertisement
AmaranSai pallaviSiva karthikeyan

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News