న్యూ కాన్సెప్ట్ మూవీగా ‘ఓ అందాల రాక్షసి’ ఆకట్టుకుంటుంది: షెరాజ్‌ మెహాది

Entertainment
Advertisement
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది.  చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ  చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

 డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ మాట్లాడుతూ - ‘ఓ అందాల రాక్షసి’ సినిమా గ్లామర్ బేస్డ్ మూవీ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఒకరకంగా ఇది వుమెన్ ఓరియెంటెడ్ మూవీ అనుకోవచ్చు. మహిళల గురించిన అంశాలు ఉంటాయి. అమాయక మహిళలు కొందరి చేతిలో ఎలా మోసపోతున్నారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. అలాగే మోసం చేసేవారికి శిక్ష కూడా ఉంటుందని చెబుతున్నాం. సుమన్, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాం. అన్నారు.

 రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ - అందరికీ నమస్కారం. ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు నేను కథ, మాటలు, పాటలు రాశాను. హీరో షెరాజ్ మెహదీకి ఒక వర్సటైల్ పర్సన్. డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోగానూ నటించారు. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. 45 రోజుల షూటింగ్ తో టాకీ, సాంగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్, గోవా, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఇది. గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ మీద వెళ్లాం. త్వరలోనే మీ ముందుకు మా ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను తీసుకొస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా మూవీ నచ్చుతుంది. అన్నారు.

 హీరోయిన్ విహాన్షి హెగ్డే మాట్లాడుతూ - డైరెక్టర్ షెరాజ్ గారు ‘ఓ అందాల రాక్షసి’ కథ చెప్పినప్పుడు ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యంగా నా క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి.కథలో కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు ‘ఓ అందాల రాక్షసి’ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీ అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.

 హీరోయిన్ నేహా దేశ్‌పాండే మాట్లాడుతూ - ‘ఓ అందాల రాక్షసి’ సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ షెరాజ్  ఈ మూవీలో ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ చూపించారు.  ఇది వుమెన్ కోసం చేసిన మూవీ. వుమెన్ ఓరియెంటెడ్ మూవీలా ఉంటుంది.  భాష్యశ్రీ గారి స్క్రిప్ట్ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల మనసులకు టచ్ అయ్యేలా మంచి కంటెంట్ తో ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రాబోతోంది. మీ సపోర్ట్ మా సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.




Advertisement
O Andala RakshasiSheraz Mehdi

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News