కార్తికేయ, హనుమాన్‌, కల్కి కోవలోనే రహస్యం ఇదం జగత్‌ : దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌

Entertainment
Advertisement
మన పురాణాలు, ఇతిహాసాల గురించి... శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు. ఆ టీజర్‌కు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌ మాట్లాడుతూ  సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.   తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. ఈ సినిమా గ్లింప్స్‌, టీజర్‌ చూసి అందరూ అభినందిస్తున్నారు. శ్రీ చక్రం ప్రేరణతో ఈ కథను తయారుచేశాను. చాలా ఎఫర్ట్‌ పెట్టి తీశాం. ఫిల్మ్‌ స్కూల్‌ నేపథ్యం నాది. అప్పుడే చాలా అవార్డుల అందుకున్నాను. కల్కి, హనుమాన్‌, కార్తికేయలా ఇది మైథలాజికిల్‌ సినిమా. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా  మన పురాణాల గురించి, మన మూలాల గురించి ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం. పూర్తిగా అమెరికాలో చిత్రీకరించి 1998లో పడమటి రాగం, ఆ తరువాత వెన్నెల వచ్చింది. 20 సంవత్సరాల తరువాత ఈ సినిమా వస్తుంది. ఈ జనరేషన్‌కు నచ్చే సినిమా ఇది. ఇండియన్‌ మైథలాజి   ప్రేరణతో ఈ కథను తయారుచేశాం. అందరిని మెప్పించే కంటెంట్‌ ఈ సినిమాలో వుంది. అదే నమ్మకంతో మేము వస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరిన్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి సర్‌ఫ్రైజ్‌ చేస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. 

హీరోయిన్‌ మానస మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కోమల్‌ గారికి థ్యాంక్స్‌. అమెరికాలో ఫుల్‌టైమ్‌ పనిచేస్తూ  సినిమా పట్ల పాషన్‌ వున్న యూఎస్‌లో వున్న వాళ్లకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్క్షతలు. అందరం ఎంతో తపనతో చేసిన సినిమా ఇది. తప్పకుండా మీరందరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం వుంది' అన్నారు. 


మరో కథానాయిక స్రవంతి పత్తిపాటి మాట్లాడుతూ ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు నాకు ఆనందంగా వుంది. యూఎస్‌లో వుండే నేను ఈ రోజు మీ ముందు వున్నానంటే దర్శకుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమే కారణం. టీజర్‌ అందరికి ఎంతో నచ్చింది. తప్పకుండా సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం వుంది' అన్నారు. 

గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ ''ఆడియన్స్‌ను  రహస్యం ఇదం జగత్‌ కొత్త ప్రపంచంలోకి తీసుకెవెళుతంది. న్యూ జోనర్‌ సినిమా. మా బుల్లి తమన్ గ్యానీ మంచి సంగీతం అందించాడు. నేను ఓ మంచి పాట రాశాను తప్పకుండా చిత్రం కూడా అందరిని నచ్చుతుంది' అన్నారు. 

మరో గీత రచయిత రమేష్‌ మాట్లాడుతూ కోమల్‌ గారు మంచి అభిరుచి గల దర్శకుడు. టీజర్‌ చూడగానే ఇదొక సమ్‌థింగ్‌ డిఫరెంట్ సినిమాలా అనిపించింది. ఈ చిత్రంలో ఓ మంచి పాట రాశాను అని తెలిపారు. 

సంగీత దర్శకుడు గ్యానీ మాట్లాడుతూ : రహస్యం ఇదం జగత్‌ వన్‌ ఇయర్‌ బ్యాక్‌ స్టార్‌ చేశాం. వెరీ బిగ్‌ థింగ్‌. తప్పుండా ఈ సినిమా కంటెంట్‌ అందరికి  తప్పకుండా నచ్చుతుంది. అనే నమ్మకం వుంది' అన్నారు. 
Advertisement
Rahasyam Idam JagathKomal R. Bharadwaj

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News