కొరటాల శివ, సందీప్‌ రెడ్డి వంగాలు అభినందించారు: నటుడు అజయ్‌

Entertainment
Advertisement
విలన్‌ పాత్రలతో పాటు అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించే నటుడు అజయ్‌. ఇటీవల పలు చిత్రాల్లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ విలన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'పొట్టేల్‌'. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ఇది. నిశాంక్ రెడ్డి కుడితి,  సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ అజయ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
 

'పొట్టేల్' సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఏమిటి?
 
సాహిత్ కథ చెప్పాడు. మొదట నేను చాలా క్యాజువల్ గా విన్నాను. ఒక రెండు గంటల నేరేషన్ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్ గా చేయాలనిపించింది. నా క్యారెక్టర్ ని చాలా బాగా చేయాలి, లేకపోతే సినిమా పాడైపోతుందనే ఫీలింగ్ ని డైరెక్టర్ కలిగించగలిగారు. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో సినిమాని కూడా అంత అద్భుతంగా తెరకెక్కించాడు. 

ఈ సినిమా ఎలా వుండబోతుంది?

ఇది మల్టీ లేయర్ కథ. పాప ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసే బ్యాక్ డ్రాప్. ఇలాంటి కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు సందేశం ఎక్కువైపోయే అవకాశం వుంది. దీన్ని కమర్షియల్ గా తీసుకురావడం చాలా కష్టం. డైరెక్టర్ సాహిత్ ఈ కథని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో చాలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. ఇందులో విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి. 

ఇందులో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి?

- కథ చాలా నచ్చింది. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ఎక్సైట్ చేసింది. తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. నాదే కాదు యువ, అనన్య వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. 


విక్రమార్కుడి తరువాత మీరు చాలా సినిమాలు చేశారు కానీ ఆ టిట్ల క్యారెక్టర్ తర్వాత పటేల్ క్యారెక్టర్ నచ్చిందని చెప్పడానికి కారణం ?  

విక్రమార్కుడు తర్వాత అంతా టెర్రిఫిక్ విలన్ వేషాలు తక్కువే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళి గారి సినిమాలోనే ఉన్నాయి. టిట్ల లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్ గా రావు. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. తర్వాత నేను కొన్ని క్యారెక్టర్స్ ట్రై చేసాను. కానీ ఆ మ్యాజిక్ కుదరలేదు. ఈ సినిమాలో చేస్తున్న పటేల్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ వున్నాయి. అందుకే చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన రోల్ దొరికిందని చెప్పాను. యాక్టర్ గా హ్యాపీనెస్ ఇచ్చిన రోల్ ఇది. 

పటేల్ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు?

-ప్రతి సినిమా యాక్టర్ కి ఒక డిస్కవరీ లానే ఉంటుంది. ఈ సినిమాలో నా వరకు కష్టపడింది కల్చర్ ని ప్రజెంట్ చేయడం కోసం. తెలంగాణలో సిగం అని ఉంటుంది. సిగం అంటే దేవుడు రావడం అంటారు. దానికి ఒక పాటర్న్ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. దానిమీద నేను డైరెక్టర్ కూర్చొని కొంత హోమ్ వర్క్ చేశాం. కొంతమందిని కలిశాం. చాలా ఎఫర్ట్ పెట్టాం. 


 ఈ సినిమాలో మూఢనమ్మకాల గురించి ఉంటుందా?


-మూఢనమ్మకాలు, మూఢనమ్మకల్ని అడ్డం పెట్టుకుని బతికే మనుషుల గురించి,  మొండితనం గురించి, గ్రామదేవతల గురించి.. ఇలా మల్టీ లేయర్స్ లో ఈ  సినిమా  వుంటుంది.

పొట్టేల్ విషయంలో సినిమా  ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమిటి?  

 -కొరటాల శివ గారికి నా వెల్ విషర్ గా ఈ సినిమా చూపించాను. దేవర పనుల్లో బిజీగా ఉండి కూడా ఆయన వచ్చి ఈ సినిమా చూశారు. ఆయనకి చాలా నచ్చింది.  సందీప్ రెడ్డి వంగా గారు చూశారు. ఆయనకీ నచ్చింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డ్స్ కూడా ఈ సినిమాకు వస్తాయని డైరెక్టర్ తో ఆయన చెప్పారు. 

 యాక్టర్ గా 25 ఇయర్స్  మీ జర్నీని డిఫైన్ చేయాలంటే ?
 
-25 ఇయర్స్ కెరీర్ నాట్ ఏ జోక్. 25 ఏళ్లుగా యాక్టర్ గా ఇక్కడ ఉన్నాం. అదే పెద్ద గిఫ్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 250 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తగ్గిపోతున్నాయి. అందరూ సెలెక్టివ్ అయిపోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాను. 


యాక్టర్ గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ?,

నాకు ఎమోషనల్ రోల్స్ చేయడం బాగా ఇష్టం. నేను ఎమోషన్స్ ని బలంగా చేయగలనని నా పర్శనల్ ఫీలింగ్.  

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?

అజయ్ దేవగన్ గారితో సింగం చేశాను. పుష్ప 2  ఉంది. అలాగే ఓ రీమేక్ మూవీ జరుగుతోంది. అలాగే తమిళ్, మలయాళం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. 

.
Advertisement
PottelPottel release dateAjay interviewTollywoodCinema

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News