ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 ప్రదానోత్సవ కార్యక్రమం ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో..!

Entertainment
Advertisement
హైదరాబాద్, 10 అక్టోబర్ 2024: నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్ జీ తెలుగు. ఎదురులేని ప్రయాణంలో ఛానల్ ఉన్నతికి తమవంతు కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు.. అందరినీ గౌరవిస్తూ అందించే సత్కారమే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్. ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబ అవార్డులను అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా ఘనంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం మరింత వైభవంగా జరిగింది. జీ తెలుగు తారలు, టాలీవుడ్ ప్రముఖులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్ 12 సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

టాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర నటీనటులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1 కార్యక్రమానికి ఎనర్జిటిక్ జోడీ రవి‌‌- లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జీ తెలుగు సీరియల్స్ కుటుంబాలన్నీ కలగలసి ఊరేగింపుతో ఘనంగా మొదలైన కార్యక్రమం అద్భుత ప్రదర్శనలు, అనుభవాలు, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. ఇక, జీ తెలుగు పాపులర్ సీరియల్స్ పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ఆడే ఫజిల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటీనటులు భానుచందర్, అర్చన ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను పంచుకుని నవ్వులు పూయించారు.

జీ తెలుగు సీరియల్ జంటలతో సాగే మ్యూజికల్ డాన్స్ వార్లో సరిగమప సింగర్స్ పోటాపోటీ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ వేడుకకు మెగాబ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై జీ తెలుగుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. 

యాక్షన్ ప్రియుల కోసం లైవ్లో గగన్ రౌడీలతో చేసే ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా సాగుతుంది. డాన్స్ కాంపిటీషన్లో భాగంగా జూనియర్లు రెట్రో ప్రదర్శన ఇవ్వగా, సీనియర్లు ట్రెండింగ్ పాటలకు డాన్స్ చేసి అలరిస్తారు. రామలక్ష్మి & శౌర్య, ఆద్య & శ్రీను, రూప & రాజు, శ్రీకర్ & అవని జంటలు వేదికపై చేసే సందడి సరదాగా సాగుతుంది. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై.విజయ సీరియల్ కోడళ్లతో చేసే సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏ అవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూసేయండి.

రెడ్ కార్పెట్పై వెండితెర ప్రముఖుల సందడి.. బుల్లితెర తారల హంగామా.. అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి 10:30 గంటలకు, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1 అక్టోబర్ 12 శనివారం సాయంత్రం 6 గంటలకు.. మీ జీ తెలుగులో!
Advertisement

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News