30కిపైగా సింగ‌ర్స్‌ను టాలీవుడ్‌కు పరిచ‌యం చేసిన వ‌న్ అండ్ ఓన్లీ షో ‘పాడుతా తీయగా’

Entertainment
Advertisement
పాటల కార్యక్రమంలో సుదీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్ ఏర్ప‌డిందంటే మామూలు విష‌యం కాదు. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం హోస్ట్‌గా ప్రారంభ‌మైన ఈ పాటల కార్య‌క్ర‌మం ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలో ముందుకు సాగుతోంది. ఈయ‌న‌తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు ఈ షోలో జడ్జ్‌లుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్‌కు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 1996లో ప్రారంభమైన ఈ సింగింగ్ షో ఎంతో మంది గాయ‌నీ గాయ‌కుల‌ను తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది. 

* పాడుతా తీయ‌గా ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 30కిపైగా సింగ‌ర్స్ టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. అందులో కొంద‌రు టాప్ సింగ‌ర్స్‌లో కొన‌సాగుతోన్నారు.
* సింగ‌ర్ ఉషా, గోపిక పూర్ణిమ పాడుతా తీయ‌గా ద్వారానే  వెలుగులోకి వ‌చ్చారు. ఉష తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో క‌లిపి వెయ్యికిపైగా పాట‌లు పాడింది. గోపిక పూర్ణిమ ఐదు వంద‌ల పాట‌లు పాడ‌టం గ‌మ‌నార్హం. 
* తెలుగులో ఎన్నో మ‌ధుర‌మైన పాట‌ల‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించిన కౌస‌ల్య కూడా పాడుతా తీయ‌గా ద్వారానే సింగ‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 
* నిత్య సంతోషిణి, లిప్సిక‌, దామిని భ‌ట్ల‌, మ‌నిషా ఎర‌బ‌త్తిని, సాహితి చాగంటి, హ‌రిణి ఇవ‌టూరి, స్మిత‌, శ్రీల‌త కూడా పాడుతా తీయ‌గా ద్వారా పాపుల‌ర్ అయ్యారు. సినిమాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకున్నారు. 
* తెలుగులో ఎనిమిది వంద‌ల‌కుపైగా పాట‌లు పాడిన సింగ‌ర్ హేమ‌చంద్ర పాడుతా తీయ‌గానే లైఫ్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ సింగ‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న అనురాగ్ కుల‌క‌ర్ణి, మ‌ల్లిఖార్జున్‌లు పాడుతా తీయ‌గా ద్వారానే అవ‌కాశాల్ని అందుకున్నారు.
* ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ కారుణ్య కూడా పాడుతా తీయ‌గాలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అత‌డితో పాటు సందీప్‌, పార్థు, రోహిత్ ఈ సింగింగ్ షో ద్వారానే మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కు చేరువ‌య్యారు.
Advertisement
Padutha TheeyagaETVSinging Show

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News