‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ఆగస్టు 5 నుంచి జీ తెలుగులో సరికొత్త ధారావాహిక

Entertainment
Advertisement
హైదరాబాద్, 31 జులై 2024: ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియల్స్ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ను అందించేందుకు సిద్ధమైంది. నిండు నూరేళ్ళ సావాసం, జగద్దాత్రి, మా అన్నయ్య, మేఘసందేశం వంటి సీరియల్స్ ఆరంభం నుంచే అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన కథ, కథనం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’. నమ్మకద్రోహానికి బలైన ఇద్దరు వ్యక్తుల జీవితమే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ సీరియల్ ఆకట్టుకునే కుటుంబ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తండ్రీకూతుళ్ల బంధం, భార్యాభర్తల అనుబంధం మధ్య ఉద్వేగభరితంగా సాగే సరికొత్త సీరియల్ ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’ ఆగస్టు 5న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

కూతురు భవిష్యత్తు కోసం ఆరాటపడే తండ్రి, ఆయన సంతోషం కోసం పాటుపడే కూతురు, తండ్రి కోరికను గౌరవించడం తప్ప మరో కల లేని కనకమహాలక్ష్మి కథే ఈ సీరియల్. తండ్రి కోరికమేరకు డిగ్రీ పూర్తి చేసిన కనకమహాలక్ష్మి ఓ దుష్టపన్నాగానికి బలైపోతుంది. అదే ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. మరోవైపు బాధ్యతాయుతమైన కొడుకుగా ఉన్న విష్ణు విహారి జీవితం నమ్మకద్రోహానికి బలవుతుంది.

విష్ణు విహారిని కలుసుకున్న కనకమహాలక్ష్మి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అనూహ్యంగా జరిగే వివాహంతో ఇద్దరి జీవితాలు ముడిపడతాయి. ప్రేమ, పెళ్లి, విధి నడుమ సాగే కథ ఉత్కంఠరేపే మలుపులతో ఆకట్టుకుంటుంది. విధిని ఎదిరించి కనకం, విష్ణు వారి జీవన ప్రయాణంలోని అడ్డంకులను ఎలా ఎదుర్కొంటారు? అనేది తెలియాలంటే కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కుతున్న కలవారి కోడలు కనకమహాలక్ష్మి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పాపులర్ నటి ప్రియ ఈ సీరియల్లో ఓ ముఖ్యపాత్ర పోషిస్తోంది. విష్ణు విహారి పాత్రలో నటిస్తున్న జై ధనుష్ తన నటనతో తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాడు. ‘వైదేహి పరిణయం’ సీరియల్లో వైదేహిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన యుక్తా మల్నాడ్ ఈ సీరియల్లో కనకం పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. కనకమహాలక్ష్మి తండ్రిగా విశ్వమోహన్ నటిస్తున్నారు. మీరూ ఈ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రతిరోజూ మిస్కాకుండా చూసేయండి!

కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ ప్రారంభంతో సూర్యకాంతం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతుంది. ప్రేక్షకులు మార్పును గమనించగలరు.

కూతురి జీవితం నాన్న కల , నాన్న కలే కనకమహాలక్ష్మి కథ - ‘కలవారి కోడలు కనకమహాలక్ష్మి’, ఆగస్టు 5న ప్రారంభం సోమవారం – శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ జీ తెలుగులో!
 
Advertisement
Zee TeluguKalavari Kodalu Kanaka Mahalakshmi

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News