ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ చేతుల మీదుగా 'రామ్‌ ఎన్‌ఆర్‌ఐ' చిత్రం నుంచి 'తెల్లవారే వెలుగుల్లోనా' పాట విడుదల

Entertainment
Advertisement
ఫీల్‌గుడ్‌ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే వుంటాయి. ఆ కోవలోనే రూపొందుతున్న మరో ఫీల్‌ గుడ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రామ్‌ ఎన్‌ఆర్‌ఐ'. 'పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌' అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో  మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తెల్లవారే వెలుగుల్లోనా అనే తొలి లిరికల్‌ వీడియోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. 

 ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌ గారు మాట్లాడుతూ... ' ఈ పాటను చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అందాలను ఒడిసి పట్టి చాలా అందమైన, అద్భుతమైన లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. ఈ పాట ద్వారా మంచి లోకేషన్స్‌ను దర్శక, నిర్మాతలు సెల్యూలాయిడ్స్‌పైకి తెచ్చినందుకు అభినందనలు. సినిమా విజువల్స్‌ చూస్తుంటే ది బెస్ట్‌ సాంకేతిక విలువలతో నిర్మించిన సినిమాలా అనిపిస్తుంది.  నాగబాబు కర్రా అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ పాటలో కనిపిస్తుంది. మన మాతృభూమికి మనం ఎంతో కొంత చేయాలి. మన మూలాలను మరిచిపోకూడదు అనే ఆలోచనతో మంచి కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి, నిర్మాతకు నా అభినందనలు. ఇంత మంచి సినిమాకు వర్క్‌ చేసిన టీమ్‌కు కూడా నా శుభాకాంక్షలు. ఈ నెల 21న జరగనున్న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకతో పాటు ఈ చిత్రం కూడా విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను' అన్నారు.

శ్రవణ్‌ సంగీతం సమకూర్చిన 'తెల్లవారే వెలుగుల్లోనా' అనే ఈ పాటకు రామాంజనేయులు యామినేని సాహిత్యం అందించగా, గాయకుడు రేవంత్‌ ఆలపించారు. పల్లె గొప్పతనాన్ని, గ్రామీణ అందాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ పాట విజువల్‌గా కూడా ఆకట్టుకునే విధంగా వుంది. 'పల్లెసీమకు ఎగిరే.. మనసే ఆనందంలో ఎగిరే.. ఊరివైపు పయనించే....' అని పాడుతూ హీరో అలీ రజా ఎంతో హుషారుగా..ఎనర్జీగా ఈ పాటలో కనిపిస్తాడు. మంచి లిరికల్‌ విలువలతో కూడిన ఈ పాట వినగానే క్యాచీగా వుంది. 

తారాగణం: అలీ రజా, సీతా నారాయణన్‌, విజయ్‌చందర్‌, గీతాంజలి, మువ్వ సత్యానారాయణ, సన, సూర్య, రఘు, జోగి నాయుడు, వేణుగోపాల్‌, రవివర్మ, జయవాణి, శ్రీమణి, మైనా 

సాంకేతిక నిపుణులు:
కథ, స్కీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.లక్ష్మీ నందా(డీఎఫ్‌ టెక్‌)
నిర్మాత: మువ్వా సత్యనారాయణ
సమర్పణ: ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ
సంభాషణలు: వీరబాబు బాసిన
సాహిత్యం: రామాంజనేయలు యామినేని
సంగీతం: శ్రవణ్‌
సినిమాటోగ్రఫర్‌: నాగబాబు కర్రా
ఎడిటర్‌: కె.రమేష్
ఆర్ట్‌: జేకే మూర్తి
ఫైట్స్‌: సూపర్‌ ఆనంద్‌
కొరియోగ్రఫీ: రేలంగి కిరణ్‌
Advertisement
Ram NRIKandula Durgesh

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News