అంతర్జాతీయ ఫ్యూజన్ ను వేడుక చేసుకునేలా టేకిలా ను విడుదల చేసిన లోకా లోక

Entertainment
Advertisement
హైదరాబాద్, జూన్ 25, 2024 : లోకా లోక ఈరోజు అధికారికంగా అంతర్జాతీయ ఆల్కోబెవ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. తమ  కార్యకలాపాల ప్రారంభ సూచికగా  టేకిలా బ్లాంకో మరియు రెపోసాడో ను విడుదల చేసింది. లోకా లోకకు  ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు రానా దగ్గుబాటి మరియు ప్రఖ్యాత సంగీతకారుడు మరియు స్వరకర్త అనిరుధ్ రవిచందర్, అనుభవజ్ఞుడైన వ్యవస్థాపకుడు, ఐరన్‌హిల్ ఇండియా  మేనేజింగ్ పార్టనర్  హర్ష వడ్లమూడి మద్దతునిస్తున్నారు.

గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా చేసుకున్న బ్రాండ్ మొదట యు ఎస్ లో విడుదల చేయబడుతుంది, తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నారు.  

జాలిస్కో డిస్టిలరీ ప్రొడక్షన్ హెడ్ లియోన్ బాన్యులోస్ రామిరెజ్ మాట్లాడుతూ  "మెక్సికన్ టేకిలా సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తుండటం సంతోషంగా వుంది.  లోకా లోకతో, మేము సంస్కృతులను అన్వేషించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము. లోకా లోక నిజంగా ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన టేకిలా అనుభవాన్ని రూపొందిస్తోంది" అని అన్నారు. 

లోకా లోక వెనుక ఇద్దరు భారతీయ చలనచిత్ర నటుడు రానా దగ్గుబాటి మరియు ప్రఖ్యాత సంగీతకారుడు మరియు స్వరకర్త అనిరుధ్ రవిచందర్ తో పాటుగా  అనుభవజ్ఞుడైన వ్యవస్థాపకుడు హర్ష వడ్లమూడి వున్నారు. 

"భారతీయ మరియు మెక్సికన్ సంస్కృతులు రెండూ గొప్ప చరిత్ర కలిగి ఉన్నాయి" అని రానా దగ్గుబాటి అన్నారు. “లోకా లోకతో, మేము ఈ సంస్కృతుల సారాంశాన్ని ఒకచోట చేర్చి, వాటిని దీర్ఘకాల టేకిలా ప్రేమికుల చెంతకు తీసుకురాబోతున్నాము.." అని అన్నారు. 

“సృజనాత్మకతతో అల్లిన సంస్కృతి మరియు హస్తకళ ఈ బ్రాండ్‌ను నిర్వచిస్తుంది”అని అనిరుధ్ జోడించారు.

"యు.ఎస్‌లో టేకిలా త్వరిత పార్టీ షాట్ నుండి చాలా మంది ఇష్టపడే అధునాతన స్పిరిట్ కు  రూపాంతరం చెందడాన్ని మేము చూసినప్పుడు, ఒక ప్రత్యేకమైన అవకాశం ఉందని స్పష్టమైంది" అని లోకా లోక వ్యవస్థాపకుడు హర్ష వడ్లమూడి వివరించారు. అంతర్జాతీయంగా అభిమానులకు  మెక్సికన్ పానీయాన్ని పరిచయం చేయడానికి ముగ్గురు భారతీయులు కలిసిన మొదటి సందర్భం ఇదన్నారు. 

లోకా లోక రెండు విభిన్న వేరియంట్‌- టేకిలా బ్లాంకో, టేకిలా రెపోసాడో - లలో అందించబడుతుంది. బ్లాంకో 750 ml బాటిల్ $45.99కి ; రెపోసాడో  $54.99కి లభిస్తుంది.

     
Advertisement
Loca LokaRana Daggubati

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News