‘కలియుగం పట్టణంలో’ పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం : హీరో విశ్వ కార్తికేయ

Entertainment
Advertisement
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.  ఈ క్రమంలో హీరో విశ్వ కార్తికేయ మంగళవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

‘కలియుగం పట్టణంలో’ టైటిల్ ఎందుకు పెట్టారు 

ప్రతీ మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటిని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. నంద్యాలలో ఈ సినిమా కథ జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని పెట్టాం.

‘కలియుగం పట్టణంలో’ ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి?
 
ఎలాంటి పాత్రనైనా చేయగలను అనే పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను. ఇందులో ప్రతీ పాత్ర చక్కగా ఉంటుంది. అన్ని కారెక్టర్లకు రెండు షేడ్స్ ఉంటాయి. రెండు షేడ్స్ ఉంటాయా? డబుల్ రోలా? అన్నది చెప్పలేం. నాకు మాత్రం ఈ కథ చాలా నచ్చింది. అందుకే ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని చేశాను.

‘కలియుగం పట్టణంలో’ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

కలియుగం పట్టణంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ కారెక్టర్ కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. కోపంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి.. ఎక్కువగా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలా ప్రతీ ఒక్క ఎమోషన్ కోసం వర్క్ షాప్‌ చేశాం.

ఇది వరకు మీరు చేసిన సినిమాలకు, ఈ మూవీకి ఉన్న తేడా ఏంటి?

నేను ఇంతకు ముందు చేసిన ‘కళాపోషకులు’ పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. 'అల్లంత దూరానా' మెలో డ్రామాగా ఉంటుంది. 'జై సేన' అనేది పూర్తి కమర్షియల్‌గా ఉంటుంది. అయితే ఈ చిత్రం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్, సస్పెన్స్ మాత్రమే కాకుండా మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. ప్రతీ రెండు మూడు సీన్లకు కొత్త జానర్ అనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నా కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.

‘కలియుగం పట్టణంలో’ సినిమాలోని కాన్సెప్ట్ ఏంటి?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపిస్తాం. పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాం. క్రైమ్స్‌లోనూ డిఫరెంట్ సీన్లు కనిపిస్తాయి.

‘కలియుగం పట్టణంలో’ షూటింగ్ అంతా కడపలోనే జరిగింది కదా.. అక్కడి అనుభవాలేంటి?

కడపలో చాలా మంచి లొకేషన్లున్నాయి. అంతా లైవ్ లొకేషన్లలోనే షూట్ చేశాం. సెట్ వర్క్ చేయలేదు. మా సినిమాను అన్నపూర్ణ బ్యానర్ రిలీజ్ చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. మంచి అవుట్ పుట్ వచ్చింది. మా సినిమాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది.

‘కలియుగం పట్టణంలో’ కథ ఎలా ఉండబోతోంది? ఎలాంటి సందేశాన్ని ఇవ్వనున్నారు?

తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం. ఎలా పెంచితే పిల్లలు ఎలా తయారవుతారో చూపించాం. చెడుని చెడుతోనే ఈ చిత్రంలో చూపిస్తాం. తల్లిదండ్రులు పెంచే తీరుతోనే పిల్లలు ఎదుగుతారు. పెంపకం వల్లే పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు. ప్రతీ మనిషిలో సైకిక్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లే అది తగ్గుతుంది.

హీరోయిన్ ఆయుషి గురించి.. ప్రధాన పాత్రను పోషించిన చిత్రా శుక్లా గురించి చెప్పండి?

ఆయుషి తెలుగు అమ్మాయి కావడం సినిమాకు కలిసి వచ్చింది. ప్రతీ కారెక్టర్‌కు డిఫరెండ్ షేడ్స్ ఉంటాయి. తన కారెక్టరైజేషన్‌లోనూ మల్టీపుల్ షేడ్స్ ఉంటాయి. తెలుగు అమ్మాయి అయితే పాత్రలోని భావాన్ని సులభంగా అర్థం చేసుకుంటుందని ఆమెను తీసుకున్నాం. నా పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఆయుషి పాత్రకీ అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. చిత్రా శుక్లా గారు ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు.

‘కలియుగం పట్టణంలో’ దర్శకుడు రమాకాంత్ రెడ్డి గారితో పని చేయడం ఎలా అనిపించింది?

కథ వినడానికి అంత ఇంట్రెస్ట్‌గా వెళ్లలేదు. కానీ మా దర్శకుడు రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ, వివరించిన విధానం, ఆ స్క్రీన్ ప్లే చూసి ఆశ్చర్యపోయాను. క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో నేను కనిపెట్టలేకపోయాను. ముందే స్టోరీ బోర్డ్ కూడా వేసుకున్నారు. మా డైరెక్టర్ ఎంతో క్లియర్ విజన్‌తో ఉన్నారు. ఆయన ఏం చెప్పారో అది చేశాను.

‘కలియుగం పట్టణంలో’ టెక్నికల్‌గా ఎలా ఉండబోతోంది?

కలియుగం పట్టణంలో టెక్నికల్‌గా ఎంతో బాగుంటుంది. కెమెరా వర్క్‌కు అందరూ ఆశ్చర్యపోతారు. పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా వచ్చాయి. అజయ్ మాకు మంచి సంగీతాన్ని ఇచ్చారు.

మీకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తోందా?

ఇండస్ట్రీ నుంచి నాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. హీరోలు, దర్శకులు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే వారు ఫిజికల్‌గా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుండేది.

మీకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చెప్పే వాళ్లు ఇష్టమా? నెగెటివ్ ఫీడ్ బ్యాక్ చెప్పేవాళ్లు ఇష్టమా?

పాజిటివ్ చెప్పే వాళ్లకంటే.. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్లంటేనే నాకు ఇష్టం. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ నుంచే మనం నేర్చుకోగలం.

‘కలియుగం పట్టణంలో’ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత?

కథ విన్నప్పుడు ఇది చిన్న బడ్జెట్‌తో తీస్తారని అనుకున్నాం. కానీ ఇది చాలా భారీ బడ్జెట్ మూవీ. నా మీద పెట్టాల్సిన దాని కంటే చాలా ఎక్కువగా పెట్టారు. మా నిర్మాతలు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. ఎక్కడా మాకు ఇబ్బంది లేకుండా షూటింగ్‌ను నిర్వహించారు.

‘కలియుగం పట్టణంలో’ సినిమాకు సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయా?

ఆ నలుగురు చాలా మంచి చిత్రం. అదే ఇప్పుడు తీస్తే.. నువ్వెవడ్రా చెప్పడానికి అని అంటారు. అందుకే మేం చెడు గురించి చెడుగానే చెప్పాలనుకున్నాం. సెన్సార్ నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.

మీరు చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్ ఏంటి?

విశ్వ ఓ సినిమా తీసినా, చేసినా ఓ మంచి సందేశం ఉంటుందని అనుకోవాలి. నా సినిమా చూసి చెడుదారిన పట్టకూడదని అనుకుంటాను. ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. ఆ మూవీలోనూ ఆయుషి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. మంత్ర, తంత్రాలు, చేతబడుల నేపథ్యంలో ఆ సినిమా ఉండబోతోంది.
Advertisement
Kaliyugam PattanamloVishwa KarthikeyaAayushi PatelTollywoodMovie News

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News