గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'సి 202' (C 202) ఫస్ట్ లుక్ విడుదల

Entertainment
Advertisement
మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలో గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశి హీరో గా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202). ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది.

అయితే జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ సందర్భంగా 

దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ "మా 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతమైన సస్పెన్స్ తో భయపడే హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ని చిత్రకరించాము. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలను మరియు మంచి లైటింగ్ పరికరాలు ఉపయోగించాము. మా చిత్రం లో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తారు. ఈ చిత్రంలో 21 నిమిషాల గ్రాఫిక్ ఉంటాయి. 

ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'సి 202' (C 202) ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నాము. 

నా గత చిత్రం హేజా(Heza) నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అమెజాన్ ప్రైమ్ లో హేజా(Heza) చిత్రాన్ని చూసి నన్ను చాలా మంది హేజా(Heza) 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. హేజా(Heza) 2 త్వరలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మంచి హారర్ థ్రిల్లర్ చిత్రం  'సి 202' (C 202) తో త్వరలో మీ ముందుకు వస్తాను. త్వరలో ట్రైలర్ ను విడుదల చేస్తాం" అని తెలిపారు. 

చిత్రం పేరు :  'సి 202' (C 202)
బ్యానర్ : మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures)

నటి నటులు : మున్నా కాశి, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, తదితరులు 

కెమెరా మాన్ : సీతారామరాజు ఉప్పుతాల్లా 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దత్తు ఎమ్ 
కో ప్రొడ్యూసర్ : చిన్నయ్య కొప్పుల, అలివేణి వొల్లేటి, ఆనంద్ వేమూరి
నిర్మాత : మనోహరి కె ఎ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం : మున్నా కాశి
Advertisement
Republic DayC 202

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News