'రూల్స్ రంజన్' మూవీ రివ్యూ

Rules Ranjan

Movie Name: Rules Ranjan

Release Date: 2023-10-06
Cast: Kiran Abbavaram, Neha Shetty, Mehar Chahal, Abhumanyu Singh, Subbaraju, Ajay, Goparaju Ramana
Director:Rathinam Krishna
Producer: Muralikrishna
Music: Amrish
Banner: Star Light Enteetainment
Rating: 2.25 out of 5
  • కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'రూల్స్ రంజన్'
  • లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కి దూరంగా వెళ్లిన కథ
  • నమ్ముకున్న కామెడీ పేలకపోవడం మైనస్ 
  • మనసును పెద్దగా పట్టుకోని పాటలు 
  • నాటకీయత ఎక్కువ కావడంతో లోపించిన సహజత్వం    

కిరణ్ అబ్బవరం హీరోగా ఆ మధ్య వరుస సినిమాలు వచ్చాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దాంతో ఈ సారి కాస్త గ్యాప్ తీసుకుని మరీ కథను సెట్ చేసుకున్నాడు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కథను పట్టుకుని సెట్స్ పైకి వెళ్లాడు. అలా రూపొందిన 'రూల్స్ రంజన్' ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. రథినం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

మనోరంజన్ ( కిరణ్ అబ్బవరం) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో అతనికి జాబ్ వస్తుంది. హిందీ రాకపోవడంతో అక్కడ అతను నానా ఇబ్బందులు పడతాడు. నార్త్ వాళ్ల పోటీని తట్టుకుని నిలబడటం కోసం చాలా సిన్సియర్ గా పనిచేసి 'రూల్స్ రంజన్' అనే పేరు తెచ్చుకుంటాడు. నాలుగేళ్లలోనే వరుస ప్రమోషన్స్ తో చాలా ఎత్తుకు ఎదిగిపోతాడు. కాకపోతే లవ్ అనేది లేని లైఫ్ నిస్సారంగా ఉంటుందని కామేశ్ (వెన్నెల కిశోర్) చెప్పిన మాటలు అతణ్ణి ఆలోచింపజేస్తాయి. 

కాలేజ్ రోజుల్లో తాను 'సన' (నేహా శెట్టి) ని ఎంతగా ఆరాధించింది గుర్తుచేసుకుంటాడు. అదే సమయంలో మెట్రో స్టేషన్లో 'సన' కనిపించడంతో అతను ఆశ్చర్యపోతాడు. ఓ ఇంటర్వ్యూ కోసం తాను ముంబై వచ్చినట్టుగా 'సన' చెబుతుంది. కాలేజ్ రోజుల్లో తనని మనోరంజన్ లవ్ చేశాడనే విషయం ఆమెకి అర్థమవుతుంది. ఆ రోజంతా ఇద్దరూ కలిసి తిరుగుతారు. ఆ రాత్రికి మనోరంజన్ తోనే ఉన్న ఆమె, ఆ మరుసటి రోజు ఉదయం తన ఊరుకి వెళ్లిపోతుంది. 

హడావిడిలో 'సన' ఫోన్ నెంబర్ తీసుకోవడం మరిచిపోయినందుకు మనోరంజన్ బాధపడతాడు. అతనంటే ప్రేమ ఉండటం వల్లనే ఒక రాత్రి అతనితో ఉండి వెళ్లిందనీ, ఆమెను పెళ్లి చేసుకోమని మనోరంజన్ తో కామేశ్ చెబుతాడు. దాంతో అతను తన ఊరుకి బయల్దేరతాడు. అక్కడ తన మిత్ర బృందానికి తాను వచ్చిన పనిని గురించి చెబుతాడు. 'సన'ను పెళ్లి చేసుకుని ఆమెను తీసుకుని వెళతానని వాళ్లతో అంటాడు. ఆ ముగ్గురికి పెళ్లిళ్లు అయినా, కాలేజ్ రోజుల్లో వాళ్లు 'సన'ను ఆరాధించినవారే. 

అందువలన ఆ ఈర్ష్యతో 'సన'తో మనోరంజన్ పెళ్లి జరక్కుండా చేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం సన అన్నయ్య (సుబ్బరాజు) ను కలిసి, మనోరంజన్ ఉద్దేశాన్ని గురించి అతనితో చెబుతారు. అప్పుడు సుబ్బరాజు ఏం చేస్తాడు? పర్యవసానంగా మనోరంజన్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? 'సన'ను పెళ్లి చేసుకోవాలనే ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 


కిరణ్ అబ్బవరానికి మంచి మాస్ ఇమేజ్ ఉంది. తను మాస్ డైలాగ్స్ బాగా చెబుతాడు .. మాస్ ఫైట్స్ బాగా చేస్తాడు .. మాస్ డాన్సులతోను మెప్పిస్తాడు. తనలో ఎనర్జీ లెవల్స్ ఎక్కువే. అలాంటి కిరణ్ అబ్బవరాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా డీసెంట్ గా చూపించడం. అతను చాలా సిన్సియర్ అనే పేరుతో చాలా సేపటి వరకూ ఎంటర్టైన్మెంట్ అనేది ఆయన దరిదాపుల్లోకి వెళ్లకుండా చూడటం .. హీరోయిన్ ఎంట్రీని గురించి పట్టించుకోకుండా హీరో తన రొటీన్ వర్క్ చేసుకుని వెళుతుండటం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.

ఫస్టాఫ్ అంతా హీరో చాలా వరకూ సీరియస్ గానే కనిపించాడు .. ఇక సెకండాఫ్ లోనైనా ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చునని ఆడియన్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా వాళ్లకి నిరాశ తప్పలేదనే చెప్పాలి. ఫస్టాఫ్ అంతా ముంబైలో జరిగితే .. సెకండాఫ్ అంతా తిరుపతిలో జరుగుతుంది. సెకండాఫ్ లో హైపర్ ఆది ... సుదర్శన్ .. వైవా హర్ష బ్యాచ్ జాయిన్ అవుతుంది. వాళ్ల ఎంట్రీ వలన హడావిడియే తప్ప కామెడీ కనిపించదు. 

అలాగే అజయ్ .. సుబ్బరాజు .. నాగినీడు వంటి వారు సెకండాఫ్ లోనే ఎంట్రీ ఇస్తారు. దాంతో విలన్ టీమ్ కి బలం పెరుగుతుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ ఆ వైపు నుంచి కూడా అలాంటి ట్విస్టులేం కనిపించవు. ప్రీ క్లైమాక్స్ నుంచి నాటకీయత పెరగడం వలన సహజత్వం పడిపోతూ రావడం కనిపిస్తుంది. ఆ మధ్య వచ్చిన ఓ రెండు సినిమాలు క్లైమాక్స్ లో కన్ఫ్యూజన్ కామెడీని నడిపించి హిట్ కొట్టాయి. ఆ దారిలో వెళ్లడానికి ట్రై చేసిన ఈ సినిమా, ఆ స్థాయిలో వర్కౌట్ చేయలేకపోయింది. 

కథ మొత్తంగా చూసుకుంటే లవ్ ట్రాక్ నుగానీ .. ఎమోషన్స్ ను గాని పెద్దగా పట్టించుకోలేదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. నేహా శెట్టి అనగానే రొమాంటిక్ సీన్స్ ను కుర్రాళ్లు ఎక్కువగా ఆశిస్తారు. పాటల్లో తప్ప ఆమె నుంచి ఆశించిన అవుట్ పుట్ ను తీసుకోలేదు. చాలావరకూ కామెడీనే నమ్ముకుని వెళ్లారుగాని అది పెద్దగా పేలలేదు. వెన్నెల కిశోర్ ట్రాక్ కూడా చాలా బలహీనంగా నడుస్తుంది. 

అమ్రిశ్ అందించిన సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. 'సమ్మోహనుడా' అనే పాట మినహా మిగతా పాటలేవీ అంతగా ఆకట్టుకోవు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. దులీప్ కుమార్ కెమెరా పనితనం కూడా ఓకే.  ప్రసాద్ ఎడిటింగ్ విషయానికొస్తే, ఇటు వెన్నెల కిశోర్ .. అటు హైపర్ ఆది టీమ్ కి సంబంధించిన సీన్స్ ను ట్రిమ్ చేసుకోవలసింది. అజిత్ .. సుబ్బరాజు .. నాగినీడు వంటి వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం ఇంతవరకూ మాస్ కంటెంట్ ను తన బలంగా భావిస్తూ వచ్చాడు. ఆ బలాన్ని పక్కన పెట్టేసి ఆయన చేసిన సినిమాగా దీనిని గురించి చెప్పుకోవచ్చు. 

Trailer

More Reviews