Atheera Raj: అందాల మందారం .. అథీరా రాజ్ లేటెస్ట్ పిక్స్

Atheera Raj Special
  • తెలుగు తెరపై మలయాళీ భామల హవా 
  • 'కృష్ణమ్మ'తో పరిచయమైన అథీరా
  • గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసిన సుందరి 
  • తెలుగులో బిజీ అయ్యే అవకాశం

తెలుగు తెరపై మలయాళీ భామల జోరు సాగుతోంది. ఆల్రెడీ ఇక్కడ చక్రం తిప్పుతున్న హీరోయిన్స్ లో మలయాళ భామలు ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడి ఆడియన్స్ ను ప్రభావితం చేసిన బ్యూటీలు .. ప్రస్తుతం తెలుగు తెరపైకి వస్తున్న అందగత్తెలు మలయాళ ఇండస్ట్రీకి చెందినవారు కావడం విశేషం. అలా ఇప్పుడు మలయాళం నుంచి మరో బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది .. ఆ బ్యూటీ పేరే 'అథీరా రాజ్'. సత్యదేవ్ హీరోగా 'కృష్ణమ్మ' సినిమా రూపొందింది. సరైన విడుదల తేదీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ వచ్చిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ద్వారానే ఇక్కడి ప్రేక్షకులకు 'అథీరా రాజ్' పరిచయమైంది. తాజా ఫొటో షూట్ నుంచి వదిలిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. చక్కని మేనిఛాయ .. ఆకర్షణీయమైన రూపం .. విశాలమైన కళ్లు ఆమెకి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వైట్ అండ్ ఎల్లో కలర్ శారీలో ఆమె అందం రెట్టింపు అవుతోంది. కుదురైన రూపంతో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న అథీరా, ఇక్కడి తెరపై కుదురుకునేలానే ఉంది. చూడాలి మరి యంగ్ హీరోల తదుపరి సినిమాలలో ఆమె బిజీ అవుతుందేమో. 

  • Loading...

More Telugu News