Chiranjeevi: కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, బంధువు... ఆయనను గెలిపించండి: చిరంజీవి

Chiranjeevi appeal to Chevella voters to vote for Konda Vishweshwar Reddy
  • చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి
  • ఉన్నత విద్యావంతుడు, సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్న చిరంజీవి
  • ఆయనను చేవెళ్ల ఓటర్లు గెలిపించాలన్న మెగాస్టార్
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఓటర్లకు విన్నవించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా మంచి మిత్రుడని చిరంజీవి తెలిపారు. తన కోడలు ఉపాసన ద్వారా కూడా చాలా దగ్గర బంధువని చెప్పారు. ఎంతో ఉత్తముడు, సౌమ్యుడు... అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని అన్నారు. 

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి విశ్వేశ్వర్ రెడ్డి వచ్చారని... ఉన్నత విద్యావంతుడని తెలిపారు. ఇలాంటి వ్యక్తి సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. నియోజకవర్గానికి గతంలో ఆయన చేసిన సేవ అందరికీ తెలిసిందేనని... చేవెళ్ల ఓటర్లు తమ విలువైన ఓట్లను విశ్వేశ్వర్ రెడ్డికి వేసి, ఆయనను గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. మంచి వ్యక్తులను గెలిపించుకుంటేనే సమాజం బాగు పడుతుందని చెప్పారు.
Chiranjeevi
Tollywood
Konda Vishweshwar Reddy
BJP

More Telugu News