'ఆదర్శ కుటుంబం' మూవీ రివ్యూ
Advertisement
Adarsha Kutumbam Review
కుటుంబ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కథానాయకుడు వెంకటేష్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇక ఇద్దరి కలయికలో సినిమా కోసం గత కొంత కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'ఆదర్శ కుటుంబం'. యాక్షన్ ప్యాక్‌డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ఆసక్తికరమైన క్రైమ్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? వెంకీ-త్రివిక్రమ్‌ల జోడీ ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ అందించిందా? లేదా తెలుసుకుందాం..
చిట్టిబాబు (వెంకటేష్) ఓ మిడిల్ క్లాస్ ప్రవైట్ ఉద్యోగి. భార్య స్వర్ణ (నిధి) చిట్‌ఫండ్స్ బిజినెస్‌లో మోసపోయి అప్పులపాలవుతుంది. ఇక చదువు అంతంత మాత్రమే ఉంటూ గుండెలో రంధ్రంతో బాధపడే కొడుకు సర్వ (ప్రజ్వల్). మెకానిక్‌తో ప్రేమాయణం నడుపుతూ కాలేజీలో చదువుకునే అమ్మాయి సంపూర్ణ (యువీనా).. ఇలా కుటుంబ సభ్యులతోనే పలు సమస్యలతో బాధపడే చిట్టిబాబుకు లాటరీలో రూ.100 కోట్లు వస్తాయి. అప్పటి వరకు అద్దె ఇంట్లో సర్దుకుపోయిన ఈ కుటుంబం ఒక్కసారిగా ఓ రిచ్ గెటెడ్ కమ్యూనిటీలో హౌస్ నెం.47 అనే విల్లాకు మారిపోతారు. ఖరీదైన కారును కొనుగోలు చేస్తారు.
ఇదే సమయంలో ఖరీదైన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దోచుకునే బీహార్ గ్యాంగ్ దోపిడి ముఠా దృష్ఠి చిట్టిబాబు ఫ్యామిలీపై పడుతుంది. అప్పుడు ఏం జరిగింది? ఆ బీహార్ గ్యాంగ్‌ను చిట్టిబాబు ఎలా ఎదుర్కొన్నాడు? తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చిట్టిబాబు కుటుంబం చేసిన సాహసాలేంటి? ఇందుకోసం ఈ కుటుంబానికి పోలీస్ ఆఫీసర్ దామోదర్ నాయుడు (నారా రోహిత్) ఎలాంటి సహకారాన్ని అందించాడు? ఈ కథకు డీఎస్పీ బృహస్పతి రావు (రావు రమేష్) కు ఉన్న సంబంధమేమిటి? మాలతి (నివేదా పేతురాజ్), చిత్తరంజన్ (సత్య) పాత్రలు ఈ సినిమాలో ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
త్రివిక్రమ్ సినిమా అంటే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అని అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా అనిపించే విధంగా తన బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌కు.. యాక్షన్.. క్రైమ్ అంశాలను జోడించి దర్శకుడు త్రివిక్రమ్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో.. వెంకటేష్ తరహా ఫ్యామిలీ అంశాలతో కొనసాగుతుంది. అప్పటి వరకు సరదాగా సాగిన ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కసారిగా అందరిని ఉలిక్కిపడేటట్టు చేస్తుంది. అక్కడి నుంచి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఈ ఫస్టాఫ్‌లోనే భార్య చేసిన అప్పుల వల్ల.. పిల్లల సమస్యల వల్ల చిట్టిబాబు పడే తప్పిలు వినోదాన్ని పంచుతాయి. అయితే చిట్టిబాబుకు రూ.100 కోట్ల లాటరీ వచ్చిన తరువాత ప్రేక్షకుల్లో కూడా ఓ తెలియని హుషారు, ఎనర్జీ వస్తుంది. కథనంలో కూడా వేగం పెరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే కథ ప్రేక్షకుల ఊహకు అందే విధంగా ఉండటంతో అక్కడక్కడా మినహా ప్రేక్షకులు పెద్దగా థ్రిల్ల్‌గా ఫీలయ్యే అవకాశం ఉండదు.
దీంతో పాటు సెకండాఫ్‌లో చిట్టిబాబు కుటుంబ సభ్యుల ఫ్లాష్‌బ్యాక్ ఏపిసోడ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అది కన్వీన్సింగ్ అనిపించదు. సెకండాఫ్‌లో త్రివిక్రమ్ రచన మరింత పదునుగా ఉంటే సినిమా ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉన్న ఫీలింగ్ కలిగేది. సత్య కామెడీ కూడా అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది. సత్య కామెడీ టైమింగ్‌ను కూడా త్రివిక్రమ్ పూర్తి స్థాయిలో వాడుకోలేదని అనిపిస్తుంది. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు సాగదీసిన భావన కలుగుతుంది. ఇటీవల వచ్చి ప్రేక్షకుల అభినందనలు అందుకున్న 'బ్లాస్ట్'చిత్ర కథ.. ఈ సినిమా కథకు పోలీకలు ఉన్నాయని గతంలో చర్చ జరిగింది. అయితే ఈ సినిమాలో ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ మినహా ఎక్కడా కూడా బ్లాస్ట్ చిత్రానికి ఈ చిత్రానికి పోలీకలు ఎక్కడా కనిపించవు. ఓవరాల్‌గా అక్కడక్కడా మెప్పిస్తూ.. మరికొన్ని చోట్ల రొటిన్ భావన కలిగిస్తూ 'ఆదర్శ కుటుంబం' ఆడియన్స్‌ను ఓ మోస్తరుగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళితే.. ఆదర్శ కుటుంబం డీసెంట్ ఫిల్మ్ అనిపిస్తుంది.
చిట్టిబాబు పాత్రలో వెంకటేష్ తనదైన కామెడీ పండించాడు. ఆయన నటనే ఈ చిత్రానికి ప్రధాన బలం. స్వర్ణగా నిధి శెట్టి అమాయకపు భార్య పాత్రతో పాటు సినిమాలో వచ్చే ట్విస్ట్‌లో యాక్షన్ ఏపిసోడ్‌లో అదరగొడుతుంది. పిల్లలుగా యువీనా, ప్రజ్వల్ మెప్పిస్తారు. పోలీస్ పాత్రలో నారా రోహిత్ కరెక్ట్‌గా కుదిరాడు. సత్య కామెడీ సినిమాలో కొన్ని చోట్ల రిలీఫ్‌గా అనిపిస్తుంది. రఘుబాబు, బ్రహ్మజీ, నివేదితా పేతురాజ్, రావు రమేష్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు త్రివిక్రమ్ ఫస్టాఫ్‌లో రాసుకున్న కుటుంబ భావోద్వేగాలు, వినోదం మెప్పించాయి.అయితే సెకండాఫ్‌లో కథనంలో ఇదే ఫ్లో ఉంటే బాగుండేదనిపించింది. సెకండాఫ్‌లో కూడా కొన్ని సన్నివేశాలు బలంగా ఉంటే సినిమా ఫలితం రేంజ్ పెరిగేది. అయితే ఈ సినిమాలో కొన్ని త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు మాత్రం అలరిస్తాయి. 'పదివేలు రెండు సార్లు లెక్కపెడితే 20వేలు అనుకునే అమయాకురాలు మా ఆవిడ'. ప్రతి ఎక్స్‌ప్రెషన్ ముఖంపై కనిపించడానికి నేనేమైనా మోహన్ లాలా? కమల్‌హాసనా?.. ఇలాంటి డైలాగ్స్ అలరిస్తాయి. తమన్ సంగీతం పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేపథ్య సంగీతం కూడా కథను డిస్ట్రబ్ చేసే విధంగానే అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా ఎలాంటి అంచనాలు లేకుంటే వెళితే.. ఈ ఆదర్శ కుటుంబం మీకు డీసెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది.

Movie Details
Movie Name: Adarsha Kutumbam
Genre: Comedy, Family Entertainer
Release Date: 30 Oct 2026
Cast: Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Rao Ramesh, Satya, Brahmaji
Director: Trivikram Srinivas
PRO: venu gopal
Music: Thaman S
Banner: Haarika and Hassine Creations
Review By: Madhu
Adarsha Kutumbam Rating: 2.5 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement