'వలవార' (జీ 5) మూవీ రివ్యూ!
కన్నడలో రూపొందిన ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే 'వలవార'. ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. సతన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పుడు కన్నడతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. గిరిధర్ - అనిరుధ్ గౌతమ్ నిర్మించిన ఈ సినిమాలో, మాస్టర్ వేద కౌశల్ ప్రధానమైన పాత్రను పోషించాడు.
అది పట్టణానికి దూరంగా ఉన్న ఒక మారుమూల పల్లె. ఆ గ్రామంలో కుందేశి (కౌశల్) అతని తల్లిదండ్రులు .. తమ్ముడు 'కొసుడి' నివసిస్తూ ఉంటారు. ఊరికి దూరంగా .. పంటపొలాలకు దగ్గరగా ఉన్న ఇల్లు వారిది. కుందేశిపట్ల తండ్రి చాలా కోపంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందువలన అతను తండ్రికి భయపడుతూ ఉంటాడు. తండ్రి చేతిలో కుందేశి దెబ్బలు తింటాడేమోనని తల్లి కూడా ఆందోళన చెందుతూ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులలో ఒక ముఖ్యమైన పనిపై కుందేశి తండ్రి పట్నం వెళతాడు. అదే సమయంలో కుందేశి .. అతని తమ్ముడు 'గౌరీ' అనే తమ ఆవును మేపుకు రావడానికి వెళతారు. కుందేశి తమ్ముడి నిర్లక్ష్యం కారణంగా ఆవు కనిపించకుండా పోతుంది. అది వేరేవారి చేలోపడి మేయడంతో, వాళ్లు దానిని తమ కొట్టంలో కట్టేస్తారు. 200 రూపాయలు ఇచ్చి ఆవును తీసుకుని వెళ్లమని కుందేశితో చెబుతారు.కుందేశి విషయం చెప్పడంతో, అతని తల్లి చేబదులుగా పక్కింటావిడ దగ్గర 200 రూపాయలు తీసుకుని ఇస్తుంది.
తండ్రి పట్నం నుంచి వచ్చేసరికి ఆవు ఇంట్లో ఉండాలి. పైగా అది సూడి ఆవు కావడంతో కుందేశి మరింత భయపడతాడు. ఆవును కట్టేసిన ఇంటికి వెళ్లిన అతను, తల్లి తనకి ఇచ్చిన 200 రూపాయల నోటు ఎక్కడో పడిపోయిందనే విషయాన్ని గ్రహిస్తాడు. వెనక్కి వెళ్లి ఎంతగా వెదికినా ఆ నోటు కనిపించదు. అప్పుడు కుందేశి ఏం చేస్తాడు? తండ్రి వచ్చేలోగా ఆవును విడిపించగలుగుతాడా? అతనిపై తండ్రికి గల కోపానికి కారణం ఏమిటి? అనేది కథ.
విలేజ్ లలో ఆవును తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తూ ఉంటారు. ఆవు తప్పిపోతే తమ కుటుంబ సభ్యుడు కనిపించకుండా పోయినంతగా కంగారు పడిపోతారు. ఆవు కోసం తలో దిక్కుకు వెళ్లి వెదకడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఆ ఇంట్లోని పిల్లలు ఆవుని మరింతగా ప్రేమిస్తూ ఉంటారు. అలా ఒక పిల్లాడికి .. తప్పిపోయిన ఆవుకు మధ్య నడిచే కథ ఇది. ఈ కథ అంతా కూడా విలేజ్ నేపథ్యంలోనే కొనసాగుతుంది.
కుందేశి ఓ పదేళ్ల పిల్లాడు. తండ్రి అంటే విపరీతమైన భయం. తండ్రి ఇంట్లో లేని సమయంలో ఆవు తప్పిపోతోంది. అతను వచ్చేలోగా ఆవును వెదికి తీసుకురావడం కోసం ఆ పిల్లాడు పడే ఆరాటం చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది.
విలేజ్ నేపథ్యం .. పేద కుటుంబం .. ఆర్ధిక ఇబ్బందులు ..కుందేశి బర్త్ డేకి కేక్ కట్ చేయించాలానే తల్లి ముచ్చటతో పాటు, ఈ మధ్యలో చోటు చేసుకునే ఒక చిన్న లవ్ ట్రాక్ ను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. విలేజ్ నేపథ్యం .. కుర్రాడి వైపు నుంచి ఉన్న ఆవు ఎమోషన్ కారణంగా ఈ కంటెంట్ ఆసక్తికరంగా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ బలహీనమైన కథాకథనాలతో .. తేలికపాటి సన్నివేశాలతో ఈ కథ కదులుతుంది.
తల్లీ కొడుకు మధ్య .. కొడుకు పట్ల తండ్రి కోపానికి గల కారణం .. ఆవు పట్ల పిల్లాడికి గల ప్రేమ .. ఇవేవీ ఆడియన్స్ కి కనెక్ట్ కావు. ఆ ఫీల్ ను వర్కౌట్ చేయలేకపోయారు. బలమైన .. బరువైన సన్నివేశాలను డిజైన్ చేసుకోలేకపోయారు. ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోకుండా పైపైన చుట్టేసినట్టుగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఏవైనా ఉన్నాయంటే అవి లొకేషన్స్ అని చెప్పాలి. గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం అలరిస్తుంది. చందమామ కథల్లోని దృశ్యాల మాదిరిగా అందమైన లొకేషన్స్ మనసుకు హత్తుకుపోతాయి. ఆ లొకేషన్స్ కి వెళ్లాలనిపించేలా ఉన్నాయి. అయితే ఆ లొకేషన్స్ లో నడిచే కథపై కసరత్తు జరగకపోవడం కనిపిస్తుంది .. నిరాశను కలిగిస్తుంది.
ప్రధానంగా కనిపించేది 6 పాత్రలే. వారి నటన ఫరవాలేదు. ఫొటోగ్రఫీ మెప్పిస్తుంది .. లొకేషన్స్ ను తెరపైకి తీసుకొచ్చిన విధానం వైపు నుంచి ఎక్కువ మార్కులు ఇస్తుంది. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. బలమైన కంటెంట్ ను రాసుకోకుండా సినిమా స్థాయి నిడివికి సాగదీసినట్టుగా కనిపిస్తుంది. సింపుల్ లైన్ ను తీసుకున్నప్పటికీ, కసరత్తు బలంగా చేసుంటే మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేదని అనిపిస్తుంది.

Movie Details
Movie Name: Valavaara
Release Date: 2026-06-05
Cast: Vedik kaishal, Shayan, Malatesh,Harshitha, Abhay
Director: Sutan Gowda
Producer: Anirudh Gaitham
Music: Manikanth
Banner: Morph prductions
Review By: Peddinti
Trailer