'కాళిదాస్ 2'( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
భరత్ హీరోగా 2019లో విడుదలైన 'కాళిదాస్' భారీ విజయాన్ని సాధించింది. ఆ ఏడాది తమిళంలో విడుదలైన హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. భరత్ క్రేజ్ ను పెంచిన సినిమాలలో ఇది ఒకటి అనే చెప్పుకోవాలి. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందినదే 'కాళిదాస్ 2'. మొదటి భాగాన్ని తెరకెక్కించిన సెంథిల్, సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చింది.
అది 500 కుటుంబాలకు పైగా నివసించే గేటెడ్ కమ్యూనిటీ. ఆ రోజు రాత్రి అంతా కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. అయితే గోకుల్ - సంజన దంపతుల కుమార్తె అయిన మూడున్నరేళ్ల పాప 'మిత్ర' కనిపించకుండా పోతుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ 'కాళిదాస్' (భరత్) రంగంలోకి దిగుతాడు. సంజన స్నేహితురాలైన 'రూప' (సంగీత మాధవన్ నాయర్) కూడా అదే కమ్యూనిటీలో నివసిస్తూ ఉంటుంది. టీనేజ్ లో ఉన్న కూతురు 'అనన్య'తో కలిసి ఆమె నివసిస్తూ ఉంటుంది.
ఆ కమ్యూనిటీకి సంబంధించిన అసోసియేషన్ లో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్న కారణంగా, అక్కడి వివరాలను కాళిదాస్ కి అందజేయడంలో 'రూప' ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కనిపించకుండా పోయిన 'మిత్ర'కి కుక్కపిల్లలు అంటే ఇష్టమని తెలుసుకున్న కాళిదాస్, ఆ వైపు నుంచి కూడా తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ సమయంలోనే ఈ కేసులోకి అసిస్టెంట్ కమిషనర్ వైష్ణవి (భవానిశ్రీ) ఎంటరవుతుంది.
'మిత్ర' డెడ్ బాడీ ఆ కమ్యూనిటీకి సమీపంలో దొరుకుతుంది. ఈ కేసు విషయంలో తలెత్తిన సందేహాలు, 'స్టీఫెన్' (అజయ్ కార్తీ) దిశగా వెళతాయి. గతంలో అతనిపై ఒక రేప్ కేసు .. 'మర్ఫీ' ముఠాకి చెందిన ఒక వ్యక్తి మర్డర్ కేసు ఉండటంతో అతణ్ణి అదుపులోకి తీసుకుంటారు. అయితే లాయర్ నటరాజన్(ప్రకాశ్ రాజ్) వచ్చి, తన జూనియర్ అయిన స్టీఫెన్ కి ఎలాంటి పాపం తెలియదని చెప్పి తీసుకుని వెళతాడు. అప్పుడు 'కాళిదాస్' ఏం చేస్తాడు? 'మిత్ర' మరణానికి కారకులు ఎవరు? 'మర్ఫీ' ముఠాతో స్టీఫెన్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి మిస్సింగ్ కేసుగా నమోదై, ఆ తరువాత మర్డర్ కేసుగా మారిన ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇది. 'మర్ఫీ' ముఠాకి సంబంధించిన ఉసక్తుల మర్డర్ తో ఈ కథ మొదలవుతుంది. ఆ తరువాత ఒక గేటెడ్ కమ్యూనిటీని నుంచి మూడున్నరేళ్ల పాప మిస్సవ్వడంతో ఈ కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అనుమానితుడికి అండగా పెద్ద లాయర్ నిలబడటం ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఒక అంశంతో మరో అంశానికి ముడిపెడుతూ దర్శకుడు ఈ కథను అల్లుకున్న విధానం ఉత్కంఠను పెంచుతుంది.
తెరపై పాప మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఆడియన్స్ కి ఆయా పాత్రలపై అనుమానాన్ని కలిగిస్తూనే దర్శకుడు ఈ కథను గేటెడ్ కమ్యూనిటీలో తిప్పుతూ ఉంటాడు. అయితే జరుగుతున్న తతంగాన్ని చూస్తున్న ప్రేక్షకులకు, అసలు అంతకుముందు ఏం జరిగి ఉంటుందనే ఒక కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది.
మర్ఫీ ముఠా హత్యల విషయంలో అనుమానితుడు .. పాప మర్డర్ కేసులో అనుమానితుడు ఒక్కడే కావడం, అతను ఆ పాప ఇంటిపైనే పూర్తి ఫోకస్ పెట్టడం .. అతనే నేరస్థుడని పోలీసులు భావిస్తూ ఉంటే, ఆలా అయ్యుండే అవకాశమే లేదని ఒక ప్రముఖ లాయర్ సపోర్టు చేయడం .. ఇలా అన్ని వైపుల నుంచి ఆడియన్స్ లో ఆత్రుతను కలిగిస్తూ వెళతాయి.
సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్లు ఎప్పుడూ కూడా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ముందుకు వెళ్లినప్పుడే అవి ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఈ సినిమా హిట్ కావడానికి కారణం కూడా అదేనని అనుకోవాలి. దర్శకుడు రివీల్ చేసేంతవరకూ ఆడియన్స్ లో చాలామంది ఏం జరిగి ఉంటుందనేది ఊహించలేరు. హత్యలు .. అందుకు గల కారణాలను గెస్ చేయలేరు. ముగింపు దగ్గర పడుతున్నా కొద్దీ పలకరించే ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి.
కాళిదాస్ పాత్రలో భరత్ మెప్పించాడు. సంగీత మాధవన్ నాయర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనుకోవాలి. స్టీఫెన్ కార్తీ నటన కూడా బాగుంది. ప్రకాశ్ రాజ్ కనిపించేది తక్కువసేపే అయినా, తనదైన ప్రభావం చూపించారు. లొకేషన్స్ న తెరపైకి తీసుకురావడంలో సురేశ్ బాల కెమెరా పనితనం నచ్చుతుంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాను నిలబెట్టేసిందని చెప్పాలి. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా అనిపిస్తుంది.
ఫలానావారే నేరం చేసి ఉంటారనే ఒక విషయాన్ని ముందుగానే మైండులో ఫిక్స్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. ఇన్వెస్టిగేషన్ పూర్తికాకముందే ఒక నిర్ధారణకు రాకూడదు. పోలీస్ అధికారుల మధ్య ఉండే ఇగో ఫీలింగ్స్ కారణంగా కూడా ఒక్కోసారి ఆధారాలు జారిపోతూ ఉంటాయి .. అసలైన నేరస్థులు తప్పించుకుంటూ ఉంటారు అనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చిన సినిమా ఇది.

Movie Details
Movie Name: Kaalidas 2
Release Date: 2026-05-12
Cast: Bharath,Ajay Karthi,Sangita Madhavan Nair, Abarnathi, Bhavani Sre,Prakash Raj,Kishore
Director: Sri Senthil
Producer: Yogeshwaran
Music: Sam CS
Banner: Sky Pictures
Review By: Peddinti
Trailer