'నిలవే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
యూత్ ఎక్కువగా మొగ్గు చూపేది ప్రేమకథా చిత్రాలపైనే. అందువల్లనే ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. సౌమిత్ రావు - శ్రేయాసి సేన్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'నిలవే'. మ్యూజికల్ టచ్ తో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమైంది. సౌమిత్ పోలాడి - సాయి కె వెన్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 9వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
అర్జున్ (సౌమిత్ రావు) ఓ అనాథ. అతను తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక స్నేహితుడు కిశోర్ (వైవా హర్ష). అర్జున్ మంచి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. అతను చిన్నప్పటి నుంచి ఒంటరివాడైన కారణంగా, తనకంటూ ఒక అందమైన తోడు కావాలనే ఆలోచనలో ఉంటాడు. ఎడారిలాంటి తన జీవితాన్ని పండుగలా మార్చేసే ఒక అందమైన అమ్మాయి కోసం అతను అన్వేషిస్తూ ఉంటాడు. ఈ విషయంలో తన నిరీక్షణ ఫలించదనే ఒక నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అర్జున్ 'ఉరి' వేసుకుంటాడు. అతను అలా తాడుకి వ్రేళ్లాడుతూ, ఎదురుగా ఉన్న అపార్టుమెంటులో ఉన్న ఒక అందమైన యువతిని చూస్తాడు. 'ఉరి'తాడు గట్టిగా బిగుసుకునేలోపు అతికష్టం మీద బ్రతికి బయటపడతాడు. అయితే ఆ దృశ్యాన్ని ఆ యువతి చూస్తుంది. ఆమె పేరు అదితి (శ్రేయాసి సేన్) అని తెలుసుకున్న అర్జున్, రహస్యంగా ఆమెను ఫోటోలు తీస్తూనే దొరికిపోతాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం మొదలవుతుంది.
అదితి తన పేరెంట్స్ కి దూరంగా ఉంటూ ఉంటుంది. అందరూ ఉన్నప్పటికీ అనాథగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. జీవితం విషయంలో తనకి ఆమె పూర్తి భిన్నంగా ఆలోచన చేస్తుందనే విషయం అర్జున్ కి అర్థమవుతుంది. తనతో స్నేహాన్ని తప్ప, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చడానికి ఆమె అంగీకరించకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదితి అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆమె గతం ఎలాంటిది? చివరికి ఈ జంట ఒకటవుతుందా? అనేది కథ.
సాధారణంగా కొన్ని కథలు ప్రధానమైన పాత్రలను కలుపుకుంటూ కొనసాగుతూ ఉంటాయి. మరికొన్ని కథలు నాయికా నాయికల చుట్టూనే తిరుగుతుంటాయి. అలా రెండో కోవకి చెందిన కథ ఇది. మొదటి నుంచి చివరివరకూ జరిగిన కథలో ఎక్కువ భాగం తెరపై కనిపించేది నాయికా నాయకులే. ఈ ఇద్దరి పరిచయం .. ప్రేమ .. గతంతో ముడిపడిన జీవితాలు .. ఇవన్నీ కూడా కథను ప్రభావితం చేస్తూ కొనసాగుతాయి.
తనకంటూ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని, ఒంటరితనం నుంచి బయటపడాలనే ఆరాటంలో హీరో ఉంటాడు. తనవాళ్ల పట్ల కోపంతో ఒంటరిగా ఉండటానికే ఇష్టపడే హీరోయిన్. ఈ కథలో ఈ అంశమే ప్రధానమైనదిగా కనిపిస్తుంది. ఇలాంటి ఒక వ్యతిరేకమైన వాతావరణంలో సాగే వారి ప్రయాణమే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ వెళుతుంది. ఒక ప్రేమకథకు కావలసిన అలకలు .. బుజ్జగింపులు .. ఈ కథలో బాగానే వర్కౌట్ చేశారు.
ఇది సినిమానే అయినా పుస్తకాలలో కనిపించే సాహిత్యం మనకి అక్కడక్కడా కవితా రూపంలో తగులుతూ ఉంటుంది. కథాకథనాలు .. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ అనే మూడు భాగాల వైపు నుంచి చూస్తే, కథ అంత గొప్పగా ఏమీ అనిపించదు. రొటీన్ కథగానే చెప్పుకోవలసి ఉంటుంది. తిప్పి తిప్పి ఒకే విషయం చెబుతున్నట్టు .. బలం లేని సన్నివేశాలను సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది.
ఎప్పుడైనా ఆర్టిస్టుల నటన సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పుడే, ఆ పాత్రల ద్వారా ఆడియన్స్ ఆ కథకు కనెక్ట్ అవుతారు. ఆ సన్నివేశాలలో తాము ఒక భాగమవుతారు. లేదంటే ఆ కథకు దూరంగానే ఉండిపోతారు. ప్రధానమైన పాత్రలను పోషించిన హీరో - హీరోయిన్ నటన ఆ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయిందనే భావన కలుగుతుంది. ఈ విషయంలో మరింత కసరత్తు చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది.
దిలీప్ కుమార్ ఫొటోగ్రఫీ బాగుంది. ఒక ప్రేమకథకు అవసరమైన ఆహ్లాదకరమైన దృశ్యాలను ఆయన తెరపై అందంగా ఆవిష్కరించారు. ఈ కథను మరింత నాణ్యతగా చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఇంకా ఈ జనరేషన్ కి తగిన బాణీలను అందించడంలో సంగీత దర్శకుడిగా కల్యాణ్ నాయక్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎడిటింగ్ వైపు నుంచి సత్యాజీ వర్క్ కూడా ఓకే.
ప్రేమకథలకు ఫీల్ అనేది ప్రాణవాయువు వంటిది. టైటిల్ దగ్గర నుంచి మాటలు .. పాటలు .. భావోద్వేగాలు .. ఇలా ప్రతి విషయంలో ఫీల్ ను వర్కౌట్ చేయవలసి ఉంటుంది. అన్నివైపుల నుంచి ఆ ఫీల్ ను పూర్తిస్థాయిలో వర్కౌట్ చేయలేకపోయారని అనిపిస్తుంది. ఈ సినిమాకి 'నిలవే' అనే టైటిల్ ను సెట్ చేశారు. అసంపూర్ణంగా ఈ టైటిల్ అసంతృప్తిని కలిగిస్తుంది.
ఈ కథలో లవ్ ఉంది .. రొమాన్స్ ఉంది .. ఎమోషన్ ఉంది. కాస్తో కూస్తో కుతూహలాన్ని రేకెత్తించే ఫ్లాష్ బ్యాకులు ఉన్నాయి. అయితే ఆడియన్స్ ను కదిలించే జీవం వాటిలో కనిపించలేదు. కీలకమైన సమయాలలో కొత్త పాత్రల ఎంట్రీలు .. ట్విస్టులు ఉన్నాయి. అయితే అవి ప్రేక్షకులను గాఢంగా పట్టుకోలేకపోయాయి. విజువల్స్ పరంగా .. సంగీతం పరంగా బలంగా కనిపించే ఈ సినిమా, కథా పరంగా బలహీనంగా అనిపిస్తుంది.

Movie Details
Movie Name: Nilave
Release Date: 2026-04-09
Cast: Soumith Rao, Shreyasi Sen,Harsha Chemudu,Supriya Aysola
Director: Sowmith Poladi - Sai K Vennam
Producer: Raj Allada - Giridhar Rao
Music: Kalyan Nayak
Banner: Point Of View Arts
Review By: Peddinti
Trailer