'తాడయం' (జీ 5) సిరీస్ రివ్యూ!
సముద్రఖనికి తమిళ .. తెలుగు భాషల్లో మంచి ఇమేజ్ ఉంది. ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ 'తాడయం'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో అజయ్ కృష్ణ నిర్మించిన ఈ సిరీస్ కీ, నవీన్ కుమార్ పళని వేల్ దర్శకత్వం వహించాడు. శివదా .. రాజ్ తిరందాస్ .. మున్నార్ రమేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఫిబ్రవరి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
అది ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం. అక్కడి గ్రామంలోని ఒక పోలీస్ స్టేషన్ లో అధియమాన్ (సముద్రఖని) ఎస్.ఐ.గా పనిచేస్తూ ఉంటాడు. 20 ఏళ్లలో అతనికి ఎప్పుడూ ఎలాంటి ప్రమోషన్స్ రావు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా, తనకేమీ పట్టనట్టుగా అతను వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా అతను 'టీ' కొట్లోనే కూర్చుని ఉంటాడనే ఒక విమర్శ ఉంటుంది. త్వరలో అతను వీఆర్ ఎస్ తీసుకుని వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఆ సమయంలోనే అతని పైఅధికారిగా కొత్తగా డ్యూటీలో చేరుతుంది లక్ష్మీ (శివదా).
అలాంటి పరిస్థితులలోనే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా హత్యలు జరగడం మొదలవుతుంది. చాలా దారుణంగా ఆ హత్యలు ఉంటాయి. భార్యాభర్తలను మాత్రమే హంతకులు టార్గెట్ చేస్తారు. చంపేసిన తరువాత పురుషుడికి సంబంధించిన మొలత్రాడును .. స్త్రీకి సంబంధించిన మంగళ సూత్రం తీసుకుని వెళ్లిపోతుంటారు. అంతే కాకుండా అక్కడి గోడపై రక్తంతో ప్రశ్న గుర్తుగీసి వెళుతుంటారు. కొత్తగా డ్యూటీలోకి చేరిన శివదా, సాధ్యమైనంత త్వరగా ఈ మిస్టరీని ఛేదించాలని అనుకుంటుంది.
అధియమాన్ ధోరణి శివదాకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హత్య కేసుల విషయంలో కూడా అతను కూల్ గా వ్యవహరించడంపై మండిపడుతుంది. అయితే అధియమాన్ చాలా తెలివైనవాడనీ, అతను ఏ విషయానికీ పెద్దగా చెలించకపోవడానికి కారణం ఉందని ఓ పోలీస్ ద్వారా లక్ష్మీ తెలుసుకుంటుంది. అధియమాన్ ను తన టీమ్ లోకి తీసుకుంటుంది. వరుసగా జరుగుతున్న హత్యలపై అతని అభిప్రాయం అడుగుతుంది. అప్పుడు అధియమాన్ ఏం చెబుతాడు? హంతకులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? అనేది మిగతా కథ.
తమిళంలో 'తాడయం' అంటే, 'ఆధారాలు' లేదా 'ఆనవాళ్లు' అనే అర్థం ఉంది. ఈ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. హంతకులను పట్టుకోవడం కోసం అందుకు సంబంధించిన ఆధారాల కోసం పోలీస్ ఆఫీసర్లు గాలిస్తూ ఉంటారు. అందువలన ఈ టైటిల్ ను సెట్ చేశారు. ఈ సిరీస్ మొత్తం చూసిన తరువాత, కథకి తగిన టైటిల్ అనే అనిపిస్తుంది.
స్వార్థ రాజకీయాలు .. అవినీతి పోలీస్ అధికారుల కారణంగా అమాయకుల జీవితాలు ఎలా 'బలి' అవుతున్నాయనే దిశగా దర్శకుడు ఈ కథను నడిపించాడు. సముద్రఖని పాత్ర చాలా నిర్లిప్తంగా .. నిరాశతో ఉన్నట్టుగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర అలా ఎందుకు ఉందనేది చివర్లోగాని అర్థం కాదు. అందుకనే ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది.
నేరాలు జరుగుతూనే ఉంటాయి .. నేరస్థులు పుట్టుకొస్తూనే ఉంటారు. అయితే అందులో కొంతమంది నేరస్థుల వెనుక కన్నీటి కథ ఉంటుంది. నేరస్థులు తమ కుటుంబాలను కోల్పోతున్నారు .. తాము శిక్షించబడుతున్నారు. కానీ వాళ్లు నేరస్థులుగా మారడానికి కారణమైనవారు మాత్రం తెర చాటునే ఉండిపోతున్నారనే విషయాన్ని ఆలోచింపజేస్తూ ఈ కథను అల్లుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
సముద్రఖని నటన చాలా డీసెంట్ గా .. నేచురల్ గా కనిపిస్తుంది. శివదా నటన కూడా మెప్పిస్తుంది. ఈ ఇద్దరి తరువాత రాజ్ తిరందాస్ నటన మంచి మార్కులు కొట్టేస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు. కెకె ఛాయాగ్రహణం .. విబిన్ భాస్కర్ నేపథ్య సంగీతం .. దినేశ్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి.
నేరస్థులను పట్టుకోవడానికి ఆధారాలు కావాలి .. ఆ నేరాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు కావాలి. నేరస్థులు సాక్ష్యులుగా మారితే తెరవెనకున్న కొంతమంది పెద్దల జీవితాలు తెల్లారిపోతాయి. అయితే అందుకు కావలసిందల్లా ఆ సాక్ష్యాలను బయటపెట్టే ధైర్యమే అనే సందేశాన్ని ఇచ్చే కథ ఇది. అక్కడక్కడా రక్తపాతంతో కూడిన సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి తప్ప, అంతకు మించిన అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు.ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్ లలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Movie Details
Movie Name: Thadayam
Release Date: 2026-02-27
Cast: Samudrakhani, Shivada, Munnar Raamesh, Sundara Pandiyan, Prem, Puli Pandi
Director: Naveen Kumar Palanivel
Producer: Ajay krishna
Music: Vibin Bhaskaar
Banner: Cocktail Cinemas
Review By: Peddinti
Trailer