'దల్దాల్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
-
ఓటీటీ సింహాసనంపై ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ మకుటం లేని మహారాజుగా వెలుగొందుతోంది. ప్రతివారం క్రైమ్ థ్రిల్లర్లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు .. సస్పెన్స్ థ్రిల్లర్లు రంగంలోకి దిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'దల్దాల్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ గా ఓ హిందీ వెబ్ సిరీస్ బరిలోకి దిగింది. హిందీతో పాటు ఇతర భాషల్లోను ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 30వ తేదీ నుంచి 7 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. భూమి పెడ్నేకర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ముంబైలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. చేతి మణికట్టు కోసి ..అందుబాటులో ఉన్న వస్తువులను నోట్లో కుక్కేసి అత్యంత దారుణంగా హత్య చేస్తుంటారు. డీసీపీ రీటా ఫెరీరా ( భూమి పెడ్నేకర్)కి ఈ కేసుకు అప్పగించడం జరుగుతుంది. ఆమెకి సహాయకారిగా మరో ఆఫీసర్ ఇందు మాత్రే (గీతా అగర్వాల్) ఉంటుంది. జరిగిన హత్యలు.. వాటి తీరుతెన్నులను రీటా పరిశీలిస్తుంది. సమాజానికి తమవంతు సాయం చేస్తున్నవారినే హత్య చేస్తున్నారనే విషయం ఆమెకి అర్థమవుతుంది.
పేదలకు అన్నదానం .. పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం .. మూగ జీవాల పట్ల కారుణ్యం చూపడం వంటివి చేస్తున్నవారే హత్యకి గురవుతూ ఉండటం, రీటాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీడియా అంతా కూడా హత్య కేసులపైనే ఎక్కవగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఒక వైపున ఆగని హత్యలు .. మరో వైపున శరణాలయాల నుంచి ఆడలిల్లల తరలింపు .. మాదక ద్రవ్యాల రవాణా రీటాకి సవాళ్లు విసురుతూ ఉంటాయి. బాల్యం చేసిన గాయాల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే, ఆమె తన డ్యూటీని కొనసాగిస్తూ ఉంటుంది.
హత్య కేసుల విషయంలో పోలీసుల వైఖరి పట్ల జర్నలిస్ట్ అనిత (సమర తిజోరి) తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె దూకుడికి పోలీసులు సైతం కంగారుపడుతూ ఉంటారు. అయితే బయట ప్రపంచానికి జర్నలిస్ట్ అనితగా కనిపిస్తున్న ఆమె, తన స్నేహితుడైన సాజీద్ (ఆదిత్య రావల్)తో కలిసి హత్యలు చేస్తూ ఉంటుంది. అందుకు కారణం ఏమిటి? సాజీద్ ఎవరు? ఈ ఇద్దరి హంతకులను పట్టుకునే విషయంలో ఏసీపీ రీటాకి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది కథ.
'దల్దాల్' అంటే 'ఊబి' అని అర్థం. అడుగు వేసేవరకూ అది 'ఊబి' అని తెలియదు. ఒకసారి అడుగువేసి తరువాత ఇక దాని నుంచి బయటపడటం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. అలా పొంచి ఉన్న ప్రమాదంలో .. అడుగును వెనక్కి తీసుకోలేని ఆపదలో చిక్కుకోవడమే ప్రధానమైన కథాంశం. ఊబి దిశగా పరిగెత్తించే వారెవరు? అందులో పడిపోయేవారెవరు? కాపాడటానికి ప్రయత్నించేవారికి ఎదురయ్యే కష్టాలు ఎలాంటివి? అనేవి ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ కథలలో హత్యలు జరుగుతూ పోతుంటాయి. హంతకులు ఎవరు? అనేది ఆడియన్స్ ను వెంటాడే మొదటి ప్రశ్న. ఎందుకోసం చేస్తున్నారు? అనేది రెండో ప్రశ్న. అయితే ఈ సిరీస్ విషయంలో, ఈ రెండు ప్రశ్నలకు ముందుగానే సమాధానం దొరికేస్తుంది. హంతకులు ఎవరు?ఎందుకు హత్యలు చేస్తున్నారు? అనేది దర్శకుడు ముందుగానే చూపించేస్తాడు. పోలీస్ ఆఫీసర్ రీటా ఎలా ఈ హంతకుల అటకట్టిస్తుంది? అనేదే ఈ కథలో ప్రధానం.
ఒక థ్రిల్లర్ సినిమాలో హంతకులు ఎవరనేది ముందుగానే చెప్పడం .. వాళ్లు హంతకులుగా ఎందుకు మారారనేది చూపించడం వలన తప్పకుండా ఆడియన్స్ కి కుతూహలం తగ్గుతుంది. అయినా ఆ సాహసం చేస్తూ దర్శకుడు ముందుకు వెళ్లాడు. హంతకుల ఆగడాలకు ఎలా అడ్డుకట్టవేస్తారో చూడాలనే దిశగానే ఆసక్తిని పెంచుతూ వెళ్లాడు. దాంతో ఒక ట్రాక్ ను నమ్ముకునే ఆడియన్స్ పరిగెత్తవలసి ఉంటుంది.
ఇటు పోలీస్ ఆఫీసర్ .. అటు కిల్లర్ ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకపోయినా, బాల్యంలో ఇద్దరూ కష్టాలను .. ఒంటరితనాన్ని అనుభవిస్తారు. అయితే ఆ కసిలో నుంచి ఒకరు పోలీస్ ఆఫీసర్ గా ఎదిగితే, మరొకరు క్రిమినల్ గా మారతారు. ఈ రెండు కోణాలను దర్శకుడు టచ్ చేసిన విధానం ఆలోచింపజేస్తుంది. అయితే హత్యల పేరుతో తెరపై చూపించిన హింసను తట్టుకోవడం కష్టమే.ఇక రీటాకి ఆదిత్యతో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన ట్రాక్ .. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ - జితిన్ పాత్రల వలన ఎలాంటి ప్రయోజనం కనిపించదు.
ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గా భూమి నటన హైలైట్ గా నిలుస్తుంది. ఆ పాత్రలో నుంచి ఆమె బయటకి రాకుండా చేసింది. నిజమైన డీసీపీని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అలాగే అనితగా సమర తిజోరి నటనలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అయినా అవలీలగా మెప్పించింది. ఇక పోలీస్ ఆఫీసర్ ఇందూగా గీతా అగర్వాల్ నటన ఆకట్టుకుంటుంది.ఈ సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. రాకేశ్ హరిదాసు ఫొటోగ్రఫీ .. శివకుమార్ పణికర్ ఎడిటింగ్ .. శుభజిత్ ముఖర్జీ నేపథ్య సంగీతం ఫరవాలేదు.
జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్లే అవకాశం వస్తే, అందరూ వెళ్లడానికి ఇష్టపడేది బాల్యంలోకే. అమ్మ .. నాన్న .. అందమైన కుటుంబం .. ఆనందకరమైన రోజులు .. అనుభూతులు .. జ్ఞాపకాలు .. కొండంత బలాన్ని ఇస్తాయి. అయితే ఆ బాల్యమే దెబ్బతింటే .. ఆ బాల్యమే గాయపడితే, అది వాళ్ల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది చెప్పడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. అయితే కథలో ఆశించిన స్థాయి కొత్తదనం లేకపోవడం .. నిదానంగా సాగడం కాస్త అసంతృప్తిగా అనిపిస్తుందంతే.

Movie Details
Movie Name: Daldal
Release Date: 2026-01-30
Cast: Bhumi Pednekar, Adithya Rawal, Sandeep Kulakarni, Geetha Agrawalm
Director: Amrithraj Guptha
Producer: Vikram Malhotra - Suresh Trveni
Music: Subhajith Mukharjee
Banner: -
Review By: Peddinti
Trailer