సొంత సైనికుల మృతదేహాలనూ తీసుకోని దేశం నీతులు చెబుతోంది.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్
- భారత సైన్యం ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిందని గుర్తుచేసిన భావిక
- పాక్‌లో మైనారిటీల హక్కుల ఉల్లంఘనపై భారత్ విమర్శలు
- జమ్మూ కశ్మీర్ వ్యవహారాల్లో జోక్యం మానుకోవాలని పాక్‌కు సూచన
- ఉగ్రవాదుల హక్కులతో పాటు బాధితుల హక్కులకూ ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ డిమాండ్
మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై భారత్‌కు నీతులు చెప్పే పాకిస్థాన్ తీరును ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా భారత్ తీవ్రంగా ఎండగట్టింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను కూడా పాకిస్థాన్ స్వీకరించలేదని గుర్తుచేసింది. అలాంటి దేశం మత విశ్వాసాలు, అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఐరాసలో భారత తొలి కార్యదర్శి భావిక మంగళానందన్ విమర్శించారు.
అంత్యక్రియల హక్కులకు సంబంధించిన అంశంపై మత స్వేచ్ఛ, విశ్వాసాలపై ఐరాస ప్రత్యేక ప్రతినిధితో జరిగిన చర్చలో భారత దౌత్యవేత్తలు ఈ వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన పలువురు పాకిస్థాన్ సైనికులకు భారత సైన్యమే సైనిక లాంఛనాలతో, ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిందని భావిక గుర్తుచేశారు. ఈ వాస్తవాలను ప్రత్యేక ప్రతినిధి నివేదికలో ప్రస్తావించకపోవడాన్ని ప్రశ్నించారు.
జమ్మూ కశ్మీర్ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకోవడం మానుకోవాలని ఆమె సూచించారు. పాక్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశం దృష్టి పెట్టాలని అన్నారు. పాకిస్థాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గిపోతోందని, వారి హక్కులు తరచూ ఉల్లంఘనలకు గురవుతున్నాయని ఆరోపించారు. సొంత దేశంలోని మైనారిటీలకు రక్షణ కల్పించలేని పాకిస్థాన్‌కు భారత్‌కు సలహాలు ఇచ్చే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.
కరోనా మహమ్మారి సమయంలో జరిగిన వివక్ష, అక్రమాలపై ప్రత్యేక ప్రతినిధి నివేదికలో అభివృద్ధి చెందిన దేశాల్లోని ఘటనలను ప్రస్తావించకపోవడాన్ని కూడా భావిక ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల బాధలను ఉపయోగించుకోవడం తగదన్నారు.
ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడుతున్న నివేదిక.. ఉగ్రవాద బాధితుల హక్కులకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. అమాయకుల ప్రాణాలను తీసే ఉగ్రవాదుల హక్కులపై చూపుతున్న శ్రద్ధ, బాధితుల విషయంలోనూ కనిపించాలని అన్నారు.