ఎల్ నినో ప్రభావం.. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు నిలిపివేత
- ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36 టీఎంసీలు
- పంటలను కాపాడేందుకు 10 రోజుల్లో 9 టీఎంసీల నీరు విడుదల
- మిగిలిన 36 టీఎంసీలను కేవలం తాగునీటి అవసరాలకు రిజర్వ్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి సాగునీటి విడుదలను ఈ ఉదయం నిలిపివేశారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల డ్యామ్‌లో తగినంత నీటి నిల్వలు లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో మిగిలి ఉన్న 36 టీఎంసీల నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే రిజర్వ్ చేస్తున్నట్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) జగదీశ్వర్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని పంటలను కాపాడేందుకు ఒక తడికి నీటిని అందించినట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ ఉదయం వరకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో పాటు వరద కాలువ, అలీ సాగర్-గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా మొత్తం 9 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు వివరించారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేనందున, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సాగునీటి విడుదలను నిలిపివేస్తున్నామని ఎస్ఈ జగదీశ్వర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఇకపై ప్రాజెక్టు నుంచి కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని సరఫరా చేయనున్నారు.