ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి.. తెలుగు ప్రజలకు పవన్, లోకేశ్ దసరా శుభాకాంక్షలు
- ప్రతి పనిలోనూ విజయం సాధించాలని మంత్రి లోకేశ్ ఆకాంక్ష
- ధర్మ విజయానికి ప్రతీక విజయదశమి అని పవన్ కల్యాణ్ వ్యాఖ్య
- ఇంద్రకీలాద్రి ఉత్సవాల వైభవాన్ని, సరస్ మేళాను ప్రస్తావించిన పవన్
- కూటమి ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని వెల్లడి
విజయదశమి పర్వదినం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.
"ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన ఈ పవిత్రమైన రోజున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చేపట్టే పనుల్లో గొప్ప విజయాలు సాధించాలి" అని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
పవన్ కల్యాణ్ తన సందేశంలో.. "అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకుంటున్నారు" అని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "భారత రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో ఇంద్రకీలాద్రి ఉత్సవాలు మరింత శోభాయమానంగా జరిగాయి. విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయస్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసింది" అని పవన్ అన్నారు.
శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.