రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం రేవంత్ దసరా శుభాకాంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం రేవంత్ దసరా శుభాకాంక్షలు

Revanth Reddy and Governor extend Dussehra greetings to Telangana people
  • రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం విజయదశమి శుభాకాంక్షలు
  • చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని వెల్లడి
  • ప్రతి ఒక్కరికీ అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరాలని ఆకాంక్ష
  • జమ్మి ఆకులను బంగారంగా భావించడం మన సంప్రదాయమన్న సీఎం
రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో ధైర్యం, ధర్మ నిష్ఠ, సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరాకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. పండుగనాడు జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మన ప్రత్యేక సంప్రదాయమని గుర్తు చేశారు.

వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
Revanth Reddy
Sivapratap Shukla
Telangana Dussehra greetings
Vijayadashami wishes
KCR
Telangana festivals

More Telugu News