ఆ రెండేళ్లూ నరకం చూశా.. ప్రతిరోజూ బతకడమే ఓ యుద్ధంలా ఉండేది: అనుపమ పరమేశ్వరన్
- గతంలో రెండేళ్ల పాటు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పిన అనుపమ
- అద్దంలో చూసుకుంటే నన్ను నేను గుర్తుపట్టలేకపోయేదాన్నని ఆవేదన
- ఆ సమయంలో నటన వదిలేయాలని కూడా ఆలోచించానన్న నటి
- మానసిక వేధింపుల వల్లే పానిక్ ఎటాక్స్, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని వెల్లడి
ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ తన గతానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. గతంలో ఒక వ్యక్తితో ఉన్న రెండేళ్ల రిలేషన్షిప్లో తాను తీవ్రమైన మానసిక వేధింపునకు గురయ్యానని తెలిపారు. తన తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ విషయాలను వెల్లడించారు. ఆ అనుభవం తనను మానసికంగా కుంగదీసిందని, వృత్తిపరంగా ఎంతో నష్టపరిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "అద్దంలో చూసుకుంటే మీరు మీకు కనిపించరు. ఆ సమయంలో నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. ప్రతిరోజూ బతకడమే ఓ యుద్ధంలా ఉండేది. మరుసటి రోజు ఏం జరుగుతుందోనన్న భయంతో గడిపాను" అని అనుపమ వివరించారు. ఆ సమయంలో నటనను కూడా వదిలేయాలనే ఆలోచన వచ్చిందని, కానీ కష్టంగానైనా షూటింగ్లకు హాజరయ్యానని చెప్పారు.
ఆ పరిస్థితుల ప్రభావంతో ఆ రెండేళ్లలో తాను నటించిన చిత్రాలలో సరిగ్గా నటించలేకపోయానని, ఇంకా మెరుగ్గా చేయాల్సిందిగా భావిస్తున్నానని అన్నారు. ఈ వేధింపుల వల్ల తాను పానిక్ ఎటాక్స్, బరువు తగ్గడం, కంటి సమస్యలు వంటి శారీరక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు అనుపమ తెలిపారు.
మొదట ప్రేమగా ఉంటూ, తర్వాత కఠినంగా ప్రవర్తించి, మళ్లీ క్షమించమని అడగడం వంటివి ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం తాను ఆ గతం నుంచి కోలుకుంటూ కెరీర్పై దృష్టి పెట్టినట్లు అనుపమ స్పష్టం చేశారు.