చదువుకున్న వాళ్లు ఓటేయకపోతే అనర్హులే అందలమెక్కుతారు: దాసోజు శ్రవణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చదువుకున్న వాళ్లు ఓటేయకపోతే అనర్హులే అందలమెక్కుతారు: దాసోజు శ్రవణ్

Dasoju Sravan says unworthy people will rule if educated people do not vote
  • పట్టభద్రులు ఓటింగ్‌పై నిర్లిప్తత వీడాలన్న దాసోజు శ్రవణ్
  • చరిత్రలో గొప్ప మార్పులు యువత భాగస్వామ్యంతోనే సాధ్యమయ్యాయని వ్యాఖ్య
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వెల్లడి
విద్యావంతులు, యువత రాజకీయాల పట్ల, ఓటింగ్ పట్ల నిర్లిప్తంగా ఉండటం సమాజానికి అత్యంత నష్టదాయకమని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న వారు ఎన్నికల రోజును కేవలం సెలవుదినంగా భావిస్తే, అనర్హులు అందలమెక్కుతారని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమాజిగూడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాజీ కార్పొరేటర్ మహేశ్ యాదవ్, బీఆర్‌ఎస్‌వీ నేత మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రవణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "చరిత్రలో ఏ గొప్ప విప్లవాత్మక మార్పు అయినా యువత భాగస్వామ్యంతోనే సాధ్యమైంది" అని అన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ వంటి కీలక నియోజకవర్గంలో కేవలం 8 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు మాత్రమే నమోదు కావడం విచారకరమని పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులందరూ ఫారం 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ నాయకత్వంలో దాదాపు 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించామని శ్రవణ్ తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చడంలో విఫలమైందని, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. 
Advertisement
Dasoju Sravan
Graduate MLC Elections
BRS Party
Telangana Politics
Voter Registration
Hyderabad Rangareddy Mahabubnagar MLC

More Telugu News