ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన.. పోలీసులు కిందపడేశారన్న ప్రియాంకగాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ఇండియా కూటమి నిరసన.. పోలీసులు కిందపడేశారన్న ప్రియాంకగాంధీ

Priyanka Gandhi says police pushed her down during INDIA Alliance protest in Delhi
  • ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల నిరసన
  • రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్
  • రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన ప్రియాంక గాంధీ
  • మహిళా పోలీసులు తనను తోసేశారని ప్రియాంక ఆరోపణ
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు వెళుతున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'ఓట్ల చోరీ' జరిగిందని ఆరోపిస్తూ, సీఈసీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు ఈ నిరసనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన సౌహార్ద విందు అనంతరం ఎంపీలందరూ బస్సుల్లో జంతర్ మంతర్‌కు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో అశోకా రోడ్డు వద్ద పోలీసులు భారీ భద్రతా వలయంతో బస్సులను నిలువరించారు.

దీంతో ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ, మరికొందరు మహిళా ఎంపీలు రోడ్డుపై పడుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. తనను అదుపులోకి తీసుకునే క్రమంలో మహిళా పోలీసులు కిందకు తోసేసి, గాయపరిచారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు.

కొందరు ఎంపీలు బస్సుల పైకెక్కి జాతీయ జెండాలు ఊపుతూ నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఐయూఎంఎల్ పార్టీల ఎంపీలు పాల్గొనగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు గైర్హాజరు కావడం గమనార్హం. 
Advertisement
Priyanka Gandhi
Rahul Gandhi
INDIA Alliance Protest Delhi
Chief Election Commissioner Gyanesh Kumar

More Telugu News