2027 వరల్డ్ కప్: పాకిస్థాన్‌ను ట్రోల్ చేసిన పార్థివ్ పటేల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2027 వరల్డ్ కప్: పాకిస్థాన్‌ను ట్రోల్ చేసిన పార్థివ్ పటేల్

Parthiv Patel trolls Pakistan over 2027 ODI World Cup format
  • 2027 ప్రపంచకప్ ఫార్మాట్‌పై పాకిస్థాన్‌ను ట్రోల్ చేసిన పార్థివ్ పటేల్
  • కొత్త షెడ్యూల్ చూసి పాకిస్థాన్ సంతోషిస్తుందని వ్యంగ్యాస్త్రాలు
  • సూపర్ 7 దశకు చేరితే చాలనుకుంటారని చమత్కారం
  • ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా
  • సెమీస్ ఫేవరెట్లను అంచనా వేసిన మాజీ వికెట్ కీపర్
2027 వన్డే ప్రపంచకప్‌ కోసం ఐసీసీ ప్రకటించిన నూతన ఫార్మాట్‌పై భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ షెడ్యూల్ చూసి పాకిస్థాన్ జట్టు ఎంతో సంతోషించి ఉంటుందని చమత్కరించాడు. స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో  మాట్లాడుతూ, "జట్లు వేర్వేరు దృక్పథాలతో ఈ షెడ్యూల్‌ను చూస్తాయి. భారత్ కనీసం సెమీ‌ఫైనల్స్‌కు చేరుకోవాలని భావిస్తుంది. కానీ, ఈ షెడ్యూల్ చూశాక పాకిస్థాన్ మాత్రం, 'మనం కచ్చితంగా సూపర్ 7 దశకు చేరుకుంటాం, ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దాం' అనుకుంటుంది. ఈ షెడ్యూల్ పట్ల పాకిస్థాన్ ఎంతో సంతృప్తిగా ఉంటుంది. రెండో రౌండ్‌కు సులభంగా చేరుకోవచ్చని వారు భావిస్తుంటారు" అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.

2027 అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఆతిథ్యంలో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇందులో 12 జట్లను ఆరేసి చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లతో పాటు, మెరుగైన ప్రదర్శన కనబర్చిన నాలుగో స్థానంలోని ఒక జట్టు 'సూపర్ 7' దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 7 దశలో ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఇందులో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.

ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్ (గ్రూప్-ఎ)లో ఉన్నాయి. వీటితో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, ఒక క్వాలిఫయర్ జట్టు ఈ గ్రూపులో ఉన్నాయి. ఈ ఫార్మాట్ ప్రకారం, భారత్-పాకిస్థాన్ జట్లు గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ 7 దశలో మరోసారి తలపడే అవకాశం ఉంది.

ఇదే సమయంలో సెమీఫైనల్ చేరే జట్లపై పార్థివ్ తన అంచనాలను వెల్లడించాడు. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఆస్ట్రేలియాకు ఈ మార్గం కష్టతరంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా, టోర్నీ గ్రూప్ దశ ప్రారంభ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.
Advertisement
Parthiv Patel
Pakistan Cricket Team
2027 ODI World Cup
ICC World Cup Format
India vs Pakistan

More Telugu News