కర్ణాటకలో 'వందేమాతరం' వివాదం.. డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ వార్నింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటకలో 'వందేమాతరం' వివాదం.. డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ వార్నింగ్

Vande Mataram controversy in Karnataka Governor warning to DK Shivakumar government
  • 'వందేమాతరం' గీతంపై కర్ణాటక ప్రభుత్వానికి గవర్నర్ లేఖ
  • గీతాన్ని రెండు చరణాలకే పరిమితం చేయడంపై తీవ్ర అభ్యంతరం
  • ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టీకరణ
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనవసర వివాదాలు తలెత్తుతాయని హెచ్చరిక
  • కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వానికి సూచన
జాతీయ గీతం 'వందేమాతరం' గానంపై కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' గీతాన్ని కేవలం రెండు చరణాలకే పరిమితం చేయడాన్ని తప్పుబడుతూ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఆయన లేఖ రాశారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, వీటిని వెంటనే పునఃపరిశీలించాలని ఆయన కోరారు.

2026 సెప్టెంబర్ 8వ తేదీన కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని లేదా గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలు మినహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' గీతంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని అందులో పేర్కొంది. అయితే, జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం-2026 సవరణ ప్రకారం జాతీయ గీతానికి కూడా చట్టబద్ధమైన రక్షణ ఉందని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు, జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని గవర్నర్ తన లేఖలో స్పష్టం చేశారు. జాతీయ చిహ్నాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి శాసన, కార్యనిర్వాహక అధికారాలు లేవని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 162, 256, 257(1)ను ఆయన ఉటంకించారు.

ఈ ఉత్తర్వులను ఇలాగే కొనసాగిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనవసర వివాదాలు తలెత్తడమే కాకుండా, రాజ్యాంగపరమైన చిక్కులకు దారితీస్తుందని గవర్నర్ హెచ్చరించారు. కావున, 'వందేమాతరం' పాడే విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.
Advertisement
Thaawarchand Gehlot
Karnataka Vande Mataram controversy
DK Shivakumar government
National Song guidelines

More Telugu News