పపువా న్యూగినియాలో అద్భుతం... 40 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన చేప
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పపువా న్యూగినియాలో అద్భుతం... 40 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించిన అరుదైన చేప

Spinach Pipefish rediscovered in Papua New Guinea after 40 years
  • పపువా న్యూగినియాలో వెలుగులోకి వచ్చిన స్పినాక్ పైప్‌ఫిష్
  • స్థానిక మహిళ వలకు చిక్కడంతో వెలుగు చూసిన అరుదైన చేప ఉనికి
  • ఈ జాతిని 'అంతరించిపోయి చేపల' జాబితాలో చేర్చిన శాస్త్రవేత్తలు
  • స్థానికులకు ఎప్పటినుంచో తెలిసినా శాస్త్రీయంగా నిర్ధారణ కాని వైనం
దాదాపు 40 ఏళ్లుగా కనుమరుగైపోయిందని భావించిన ఒక అరుదైన మంచినీటి చేప తిరిగి ప్రత్యక్షమైంది. శాస్త్రవేత్తలు 1985లో చివరిసారిగా గుర్తించిన ఈ 'స్పినాక్ పైప్‌ఫిష్‌'ను పపువా న్యూగినియాలోని సెపిక్ నదిలో తాజాగా కనుగొన్నారు. స్థానిక ప్రజల సహకారం, వారి పరిజ్ఞానం వల్లే ఈ అరుదైన చేప ఉనికి బయటపడటం విశేషం.

ఈ ఏడాది జూన్ నెలలో ఈ చేప కోసం గాలిస్తున్న పరిశోధకుల బృందం, ఫలితం లేక నిరాశతో వెనుదిరగడానికి సిద్ధమైన చివరి రోజున ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇంబండో గ్రామానికి చెందిన హెలెన్ అసు అనే స్థానిక మహిళ, రొయ్యల కోసం తన సంప్రదాయ చేతి వల 'ఉంబెన్‌'తో వేటాడుతుండగా రెండు పైప్‌ఫిష్ లు చిక్కాయి. పరిశోధకురాలు జెర్రికా ఏజ్‌బిగో వాటిని ఫోటోలు తీసి నిపుణులకు పంపగా, వారు అది స్పినాక్ పైప్‌ఫిష్‌ అని ధ్రువీకరించారు.

సముద్ర గుర్రాల జాతికి చెందిన ఈ చేప సన్నని శరీరం, పొడవాటి ముట్టెతో విభిన్నంగా ఉంటుంది. ఆకుపచ్చ-గోధుమ రంగులో ఉండటం వల్ల నది ఒడ్డున ఉండే జలచర మొక్కలలో ఇది సులభంగా కలిసిపోతుంది. సముద్ర గుర్రాల మాదిరిగానే, మగ చేపలు తమ కడుపులోని సంచిలో పిల్లలను మోయడం వీటి ప్రత్యేక లక్షణం.

శాస్త్రవేత్తలు దీనిని 'అంతరించిపోయిన చేపల' జాబితాలో చేర్చినప్పటికీ, స్థానిక ప్రజలకు దీని ఉనికి గురించి ఎప్పటి నుంచో తెలుసు. వారు దీనిని 'కరువెంగ్', 'ఇనాప్' వంటి స్థానిక పేర్లతో పిలుచుకుంటారు. దీన్ని బట్టి, శాస్త్రీయ రికార్డులలో లేనప్పటికీ ఈ జాతి ఆ ప్రాంతంలో మనుగడ సాగిస్తోందని అర్థమవుతోంది. ప్రస్తుతం పరిశోధకులు ఈ చేపల జీవనశైలి, ఇతర అంశాలపై మరింత లోతైన అధ్యయనం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
Advertisement
Spinach Pipefish
Papua New Guinea
Sepik River
Rare fish species
Freshwater fish rediscovery

More Telugu News