ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. రేపే లాంచ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆపిల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. రేపే లాంచ్!

Apple First Foldable iPhone Launching Tomorrow
  • పుస్తకంలా తెరుచుకునే డిజైన్, దాదాపు కనిపించని మడత
  • పవర్‌ఫుల్ ఏ20 చిప్, 12 జీబీ ర్యామ్, సైడ్ టచ్ ఐడీ
  • సుమారు 2,000 డాలర్ల నుంచి ప్రారంభమయ్యే అవకాశం
  • ఐఫోన్ 18 సిరీస్‌తో పాటే ఈ ఫోన్ విడుదల
టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న (రేపు) జరిగే 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్‌లో ఈ సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమైనట్లు సమాచారం. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు దీనిని కూడా లాంచ్ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు 'ఐఫోన్ అల్ట్రా' లేదా 'ఐఫోన్ ఫోల్డ్' అని పేరు పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వివిధ నివేదికల ప్రకారం, ఇది పుస్తకంలా పక్కకు తెరుచుకునే (బుక్-స్టైల్) డిజైన్‌లో రానుంది. ఫోన్‌ను మడిచినప్పుడు ముందు వైపు ఉండే కవర్ డిస్‌ప్లే సుమారు 5.3 నుంచి 5.5 అంగుళాలు ఉండొచ్చు. తెరిచినప్పుడు లోపలి ప్రధాన స్క్రీన్ 7.6 నుంచి 7.8 అంగుళాల వరకు ఉంటుందని అంచనా. ముఖ్యంగా, స్క్రీన్ మధ్యలో మడత దాదాపు కనిపించకుండా, చాలా పలచని నిర్మాణంతో దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఫ్రేమ్ కోసం టైటానియం-అల్యూమినియం మిశ్రమాన్ని వాడొచ్చని తెలుస్తోంది.

హార్డ్‌వేర్ విషయానికొస్తే, ఇందులో ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఏ20 లేదా ఏ20 ప్రో చిప్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. సుమారు 12 జీబీ ర్యామ్‌తో ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 48 ఎంపీ వైడ్, అల్ట్రావైడ్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. అయితే, స్థలాభావం వల్ల టెలిఫోటో లెన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. పవర్ బటన్‌లోనే టచ్ ఐడీని అమర్చవచ్చని, ఫేస్ ఐడీకి బదులుగా దీనిని వాడొచ్చని లీక్స్ చెబుతున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5,000 నుంచి 5,800 ఎంఏహెచ్ మధ్య ఉండొచ్చని అంచనా.

ధర విషయంలో ఇది అత్యంత ప్రీమియం ఉత్పత్తిగా నిలవనుంది. దీని ప్రారంభ ధర 2,000 నుంచి 2,500 డాలర్ల మధ్య ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 9న ప్రకటన వెలువడిన తర్వాత, ఐఫోన్ 18 సిరీస్‌తో పాటే దీని ప్రీ-ఆర్డర్లు మొదలుకావొచ్చు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మధ్యలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోల్డబుల్ మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ వివరాలన్నీ లీక్స్ ఆధారంగా వచ్చినవేనని, సెప్టెంబర్ 9న జరిగే అధికారిక ఈవెంట్‌లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Apple
Foldable iPhone
iPhone Fold
iPhone Ultra
Apple Event September 9
iPhone 18 Pro Max

More Telugu News