రోజు అద్భుతంగా ఉండాలా?.. ఉదయం ఈ 7 చిన్న అలవాట్లు పాటించండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజు అద్భుతంగా ఉండాలా?.. ఉదయం ఈ 7 చిన్న అలవాట్లు పాటించండి

7 Simple Morning Habits to Make Your Day Wonderful
  • 5 గంటలకే లేవాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
  • లేవగానే వెంటనే ఫోన్ చూడొద్దని సూచన
  • ఉదయం ఎండ ఆరోగ్యానికి చాలా మంచిది
  • టీ, కాఫీకి ముందు నీళ్లు తాగాలి
  • రోజూ కొద్దిసేపు శరీరాన్ని కదిలించాలి
  • పోషకాలు ఉన్న అల్పాహారం తినాలి
ఉదయం 5 గంటలకు లేవడం, జిమ్‌కు వెళ్లడం, ధ్యానం చేయడం.. సోషల్ మీడియాలో కనిపించే ‘పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్’ అందరికీ సాధ్యం కాదు. నిజానికి రోజు మంచిగా ప్రారంభం కావాలంటే గడియారం చూపే సమయం కంటే, మీరు రోజును ఎలా మొదలుపెడుతున్నారనేదే ముఖ్యం. మీ జీవనశైలికి సరిపోయే చిన్నచిన్న అలవాట్లు కూడా రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడతాయి. అలాంటి సులభమైన ఏడు ఉదయపు అలవాట్లు ఇవే..

ఫోన్ చూడొద్దు
లేవగానే ఫోన్ చేతిలోకి తీసుకుంటే నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, మెయిల్స్‌లో మునిగిపోతాం. అందుకే కనీసం 10-15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండండి. కిటికీ తెరవడం, స్ట్రెచింగ్ చేయడం లేదా ప్రశాంతంగా కూర్చోవడం ద్వారా మెదడు సహజంగా మేల్కొంటుంది.

ఎండను ఆస్వాదించండి
ఉదయం కిటికీలు తెరిచి ఎండ ఇంట్లోకి వచ్చేలా చేయండి. సహజ కాంతి శరీరంలోని బయోలాజికల్ క్లాక్‌ను సమతుల్యం చేసి, రోజంతా చురుకుదనాన్ని పెంచుతుంది. వీలైతే బాల్కనీలో లేదా బయట కొద్దిసేపు నడవండి.

ఒక గ్లాస్ నీళ్లు తాగండి
రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరానికి ముందుగా నీళ్లు అవసరం. కాఫీ లేదా టీ తాగే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల శరీరం తాజాగా మారుతుంది. మంచం పక్కనే బాటిల్ ఉంచుకోవడం ఈ అలవాటును సులభం చేస్తుంది.

శరీరాన్ని కదిలించండి
రోజూ జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు స్ట్రెచింగ్ చేయడం, ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేయడం లేదా చిన్న వాక్‌కు వెళ్లడం కూడా సరిపోతుంది. ఇది శరీరానికి కొత్త రోజు ప్రారంభమైందనే సంకేతాన్ని ఇస్తుంది.

పోషకాలున్న అల్పాహారం
బిజీ కారణంగా బ్రేక్‌ఫాస్ట్ మానేయడం మంచిది కాదు. ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అల్పాహారం తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఓట్స్, గుడ్లు, పెరుగు-పండ్లు లేదా పీనట్ బట్టర్ శాండ్‌విచ్ మంచి ఆప్షన్స్‌.

ముఖ్యమైన పనిని నిర్ణయించుకోండి
పెద్ద ‘టు-డూ లిస్ట్’ చూసి ఒత్తిడికి గురికావద్దు. ఈరోజు తప్పకుండా పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పనిని మాత్రమే ముందుగా నిర్ణయించుకోండి. అది పూర్తైతే మిగతా పనులు అదనపు విజయాలుగా అనిపిస్తాయి.

ఐదు నిమిషాల ప్రశాంత సమయం
ధ్యానం లేదా పెద్ద జర్నలింగ్ చేయాల్సిన అవసరం లేదు. టీ తాగుతూ ప్రశాంతంగా కూర్చోవడం, మొక్కలకు నీళ్లు పోయడం, రెండు పేజీలు పుస్తకం చదవడం లేదా ఇష్టమైన పాట వినడం కూడా సరిపోతుంది. ఈ చిన్న విరామం రోజును ప్రశాంతంగా ప్రారంభించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ సూచనలు అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిలో మార్పులు చేసేముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Advertisement
Morning Habits
Healthy Lifestyle
Productivity Tips
Morning Routine
Wellness Habits
Daily Health

More Telugu News