బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్‌డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్‌డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Bajaj Pulsar 220F latest update new features and price details
  • పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను జోడించిన కంపెనీ
  • హాలోజన్ బల్బ్ స్థానంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌
  • అలాగే ఉన్న సిగ్నేచర్ సెమీ-ఫెయిర్డ్ లుక్, బాడీ డిజైన్‌
  • కొత్త అప్‌డేట్‌తో రూ.8,000 పెరిగిన ధర
బజాజ్ పల్సర్ లవర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సరికొత్త అప్‌డేట్‌తో ఐకానిక్ బైక్ ‘బజాజ్ పల్సర్ 220F’ మార్కెట్లోకి వచ్చేసింది. ఈ బైక్‌కు కంపెనీ ఇప్పుడు పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను జోడించింది. 2025 డిసెంబరులో వచ్చిన అప్‌డేట్ (కొత్త గ్రాఫిక్స్, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, సరికొత్త కలర్స్) తర్వాత ఈ బైక్‌లో బజాజ్ సంస్థ చేసిన రెండో ప్రధానమైన మార్పు ఇదే కావడం విశేషం.

ఈ సరికొత్త అప్‌డేట్‌లో భాగంగా ఇప్పటివరకు వస్తున్న పాత హాలోజన్ బల్బ్ స్థానంలో పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను అమర్చారు. దీనితో పాటు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ (డేటైమ్ రన్నింగ్ లైట్స్) కూడా జతచేశారు. అయితే హెడ్‌లైట్ మారినప్పటికీ ‘పల్సర్ 220ఎఫ్‌’కి ఉన్న సిగ్నేచర్ సెమీ-ఫెయిర్డ్ లుక్, బాడీ డిజైన్‌ను అలాగే ఉంచారు. దీనివల్ల పల్సర్ క్లాసిక్ విజువల్ అప్పీల్ ఏమాత్రం మారకుండా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

ఇక మెకానికల్ పరంగా బైక్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న నమ్మకమైన పెర్ఫార్మెన్స్‌నే ఇందులోనూ కొనసాగించారు. ఇది 220సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 20.9హెచ్‌పీ పవర్, 18.6ఎన్‌ఎమ్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.

ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ అప్‌డేట్ కారణంగా ఈ బైక్ ధర కొంత పెరిగింది. ప్రస్తుతం ఈ కొత్త పల్సర్ 220ఎఫ్‌ ధర ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.36 లక్షలు. గతంలో 2025 డిసెంబరు అప్‌డేట్ తర్వాత దీని ధర రూ.1.28 లక్షలుగా ఉండేది. ఇప్పుడు కొత్త ఫీచర్ రాకతో ధర రూ. 8,000 పెరిగింది.

బజాజ్ పోర్ట్‌ఫోలియోలోనే ఇది అత్యంత పాత మోడల్ అయినప్పటికీ, మార్కెట్లోకి ఎన్ని కొత్త ఆధునిక బైకులు వచ్చినా పల్సర్ 220ఎఫ్‌కు ఉన్న క్రేజ్, కస్టమర్ బేస్ అస్సలు తగ్గలేదు. ఈ సరికొత్త ఎల్‌ఈడీ అప్‌డేట్ ఈ బైక్ వాల్యూ, నమ్మకాన్ని మరింత పెంచిందని చెప్పొచ్చు. మరోవైపు, బజాజ్ సంస్థ తమ పల్సర్ సిరీస్ మొత్తాన్ని రీఫ్రెష్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే నెక్స్ట్ జనరేషన్ ‘పల్సర్ 125’ బైక్‌ను కూడా ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
Advertisement
Bajaj Pulsar 220F
Bajaj Auto
Pulsar 220F LED Headlamp
Pulsar 220F Price Update
New Pulsar Features
Indian Motorcycles

More Telugu News