జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది: నారా లోకేశ్
- డీఎస్సీపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
- వాస్తవాలు, డేటాతో జగన్ ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందన్న లోకేశ్
- న్యాయస్థానాలు కూడా ఆ వాదనలను కొట్టిపారేశాయని వెల్లడి
- యువతకు అనవసర ఆందోళన కలిగించినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
"జగన్ రెడ్డి సృష్టించిన తప్పుడు ప్రచారం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది. ఆయన చేసిన ప్రతి ఆరోపణను మేం వాస్తవాలు, డేటాతో సహా తప్పని నిరూపించాం. మేము మొదటి నుంచి ఏం చెబుతున్నామో అదే నిజమని ఇప్పుడు రుజువైంది.
మా వాదనను న్యాయస్థానాలు కూడా సమర్థించాయి. జగన్ చేసిన నిరాధార ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయి. దీంతో ఈ నియామక ప్రక్రియలో మా నిజాయతీ మరోసారి నిరూపితమైంది. లక్షలాది మంది అభ్యర్థులను తప్పుదోవ పట్టించి, వారిలో అనవసర ఆందోళన కలిగించిన ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతోంది. వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం.
ఇంత జరిగిన తర్వాత, రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించినందుకు వైఎస్ జగన్ గారు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్" అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.