టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
- భారత సీనియర్ జట్టుకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
- టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డ్
- ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడల టీ20 జట్లలో చోటు
- వైభవ్ ఒక అద్భుత ప్రతిభావంతుడని కొనియాడిన అజిత్ అగార్కర్
- యువ సంచలనాన్ని గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్న చీఫ్ సెలక్టర్
ఈ సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించాడు. యువ క్రికెటర్‌గా వైభవ్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడాడు.
"ఒక యువ ఆటగాడి గురించి ఏం చెప్పగలం? అతడు ఏం చేయగలడో మీరంతా చూశారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కూడా దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించాడు. అతని బ్యాటింగ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్‌లోనే కాదు, గత సీజన్‌లోనూ అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్ లాంటి అత్యంత పోటీ, ఒత్తిడి ఉండే టోర్నమెంట్‌లో అతడు ఎంతో విధ్వంసకరంగా, గేమ్ ఛేంజర్‌గా మారగలడు. క్రికెట్‌ను, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ను చూసేవారికి అతనిపై భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి అతడు తన ప్రదర్శనతోనే జట్టులో చోటు దక్కించుకున్నాడు" అని అగార్కర్ వివరించాడు.