‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన

Krithi Shetty response on trolls
  • వరుస ఫ్లాప్ సినిమాలతో కృతి శెట్టిపై ట్రోలింగ్
  • ఐరల్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
  • సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణమన్న కృతి
  • సినిమాల్లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువని వ్యాఖ్య
  • సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని వ్యాఖ్య

‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, ‘వా వా వాతియార్’ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, నెటిజన్లు ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.


ఈ నేపథ్యంలో ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి శెట్టి, తనపై వస్తున్న విమర్శలను నేరుగా తిప్పికొడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ప్లాప్ అయితే దానికి హీరోయిన్లను బ్లేమ్ చేయడం చాలా అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సినిమాల్లో హీరోయిన్ల పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని, సినిమాను ఎలా తీయాలి లేదా కథను ఎలా నడపాలనే విషయాల్లో తమకు ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తమపై ‘ఐరన్ లెగ్’ అనే ట్యాగ్ వేయడం విచిత్రంగా ఉందని, అసలు పరిశ్రమలో ఒక సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.


కృతి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సినిమా ప్లాప్ అయితే హీరోయిన్లను మాత్రమే టార్గెట్ చేయడం తప్పు అంటూ ఒక వర్గం ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరో వర్గం మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సినిమా హిట్ అయినప్పుడు క్రెడిట్ తీసుకునే హీరోయిన్లు, ప్లాప్ అయినప్పుడు మాత్రం బాధ్యత తీసుకోరా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే సక్సెస్ ఫార్ములా ఎవరికీ తెలియదంటూ కృతి చేసిన వ్యాఖ్యలు సీనియర్ దర్శకులు, నిర్మాతల అనుభవాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయంటూ పరిశ్రమలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Krithi Shetty
Tollywood
Kollywood

More Telugu News