ఏపీలో మరో ప్రైవేటు బస్సు బోల్తా
- కడప జిల్లా గోపవరం మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా
- గేదె అకస్మాత్తుగా అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
- ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
ప్రమాదం వివరాల్లోకి వెళితే, బస్సు వేగంగా వెళుతున్న సమయంలో ఒక గేదె అకస్మాత్తుగా అడ్డురావడంతో... దాన్ని తప్పించబోయే ప్రయత్నాన్ని డ్రైవర్ చేశాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. బస్సు బోల్తా కొట్టినప్పటికీ పెను ముప్పు తప్పింది. కేవలం ఒక ప్రయాణికుడి మాత్రం కాలికి తీవ్ర గాయమయింది. కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.