కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

Upendra as CM Shivaraj Kumar Comments
  • పాలిటిక్స్‌పై శివరాజ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు
  • తమిళనాడులో విజయ్ విజయం ప్రస్తావన
  • కర్ణాటక ప్రజలు ఆదరించాలని కోరిక
  • తనకు రాజకీయాసక్తి లేదని స్పష్టీకరణ
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రాజకీయాలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ, తెలుగు నాట చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తోటి నటుడు ఉపేంద్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయ్ తరహా విజయం
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సాధించిన ఘన విజయం, సాధిస్తున్న ప్రజాదరణను శివరాజ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రంలో విజయ్‌ను ప్రజలు అంతలా ఆదరించినప్పుడు కర్ణాటకలో ఉపేంద్రకు ఎందుకు అలాంటి మద్దతు ఇవ్వకూడదని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉపేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నటీనటులు కేవలం సినిమాల్లో మాత్రమే ముఖానికి రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో రంగులు మార్చరని, నిజాయతీగా ఉంటారని వ్యాఖ్యానించారు.

పబ్లిసిటీ అవసరం లేదు
మంచి పనులు చేయడానికి ఎప్పుడూ వార్తాపత్రికల కవరేజ్ లేదా పబ్లిసిటీ అవసరం లేదని శివరాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. చేసే పనిలో నిజాయతీ ఉంటే ప్రజలు దాన్ని గుర్తిస్తారని, దేవుడి ఆశీస్సులూ ఉంటాయని పేర్కొన్నారు. తమ కుటుంబం ఎప్పటి నుంచో మీడియా ప్రచారం కోరుకోకుండా సామాన్యులకు సేవ చేస్తోందని గుర్తు చేశారు. అయితే తనకు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తమ అభిమానులు కూడా సమాజంలో నలుగురికీ సాయం చేస్తూ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు.
Advertisement
shivaraj Kumar
Upendra
Karnataka

More Telugu News