కేరళలోకి 'టీవీకే' వస్తే తప్పేంటి?.. విజయ్ పార్టీ విస్తరణపై సురేశ్ గోపి కీలక వ్యాఖ్యలు
- విజయ్ పాలనను విమర్శించడం తొందరపాటేనన్న సురేశ్ గోపి
- కేరళలో టీవీకే పార్టీ విస్తరణను స్వాగతించిన కేంద్ర మంత్రి
- విజయ్ రాజకీయ ఎంట్రీపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన మమ్ముట్టి
- స్క్రీన్ ఇమేజ్ వల్లే విజయ్‌కు ఇంతటి ఆదరణ అన్న మోహన్‌లాల్
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు జోసెఫ్ సి.విజయ్ రాజకీయ ప్రస్థానంపై సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల స్పందనలు కొనసాగుతున్నాయి. తాజాగా మలయాళ సీనియర్ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి.. విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడే విజయ్ ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఒక నిర్వాహకుడిగా, పాలకుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి విజయ్‌కు తగిన సమయం ఇవ్వాలని, ఆ తర్వాతే విమర్శలు చేయాలని మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారని, విజయ్ మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళలోకి టీవీకే విస్తరణపై స్వాగతం
తమిళనాడు దాటి కేరళ వంటి పొరుగు రాష్ట్రాల్లోకి విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) విస్తరించే అవకాశం ఉందన్న ఊహాగానాలపై సురేశ్ గోపి సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యకలాపాలను ఎక్కడైనా విస్తరించుకునే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడులో విజయం సాధించిన ఒక పార్టీ కేరళలోకి వస్తే తప్పేంటని, ఆయన ఎక్కడికైనా రావచ్చునని, అందరి వల్ల ప్రపంచానికి, తమిళ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు సురేశ్ గోపి వ్యాఖ్యానించారు.
మమ్ముట్టి మౌనం.. మోహన్‌లాల్ విశ్లేషణ
మరోవైపు విజయ్ రాజకీయ రంగప్రవేశంపై మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాత్రం గతంలోనే స్పందించడానికి నిరాకరించారు. ఈ విషయంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ఆయన కేవలం చిరునవ్వుతో సమాధానమిస్తూ దాటవేశారు. అయితే, 'దృశ్యం 3' ప్రమోషన్స్ సమయంలో మరో స్టార్ హీరో మోహన్‌లాల్.. విజయ్ స్టార్‌డమ్ గురించి మాట్లాడారు. నటులు చేసే పాత్రల వల్లే ప్రేక్షకులు వారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని, వ్యక్తిగత విషయాల వల్ల కాదని విశ్లేషించారు. తమిళ సినిమా దిగ్గజాలు ఎంజీఆర్, రజనీకాంత్ వంటి వారు కూడా వారి స్క్రీన్ ఇమేజ్ వల్లే ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు.