స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

Gold Prices Slightly Decreased in Major Cities
  • బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,58,880
  • పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర
బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరపై ఒత్తిడి నెలకొంది. అయితే, వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

బుధవారం ఉదయం మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం, హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 480 తగ్గి రూ.1,58,880 వద్దకు చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులంపై రూ.440 తగ్గి రూ. 1,45,640గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,030గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,45,790గా ఉంది.

మరోవైపు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై మార్కెట్లలో కిలో వెండి ధర రూ. 2,94,900గా ఉంది. ఢిల్లీ, బెంగళూరులో మాత్రం కిలో వెండి రూ. 2,84,900గా ట్రేడ్ అవుతోంది.
Go Back to Shorts
Gold Prices
Gold Rate Today
Hyderabad Gold Rate
Vijayawada Gold Rate
Delhi Gold Rate
Silver Prices
Commodity Market
24 Carat Gold
22 Carat Gold
Gold Market

More Telugu News