అసోం అసెంబ్లీలో ఆసక్తికర ఘటన.. మమతా బెనర్జీకి అనుకూలంగా నినాదాలు
- ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకార సమయంలో "మమతా దీదీ జిందాబాద్" అంటూ నినాదాలు
- మండియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అహ్మద్
- ఎన్నికలకు కొన్నిరోజుల ముందు టీఎంసీలో చేరిక
అసోం శాసనసభ తొలిరోజు కొత్తగా ఎన్నికైన 126 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి సిద్దమైన సమయంలో నాటకీయ పరిమాణం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరర "మమతా దీదీ జిందాబాద్" అని నినాదాలు చేయడం కలకలం రేపింది.
ప్రొటెం స్పీకర్ చంద్రమోహన్ పటోవరీ, అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారుల పర్యవేక్షణలో 126 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అయిన షెర్మాన్ అలీ అహ్మద్, తన ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నినాదాలు చేశారు. మాండియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అహ్మద్, అసోం అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఎంసీలో చేరారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్మద్‌ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 2021లో కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయన ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో రైజోర్ దళ్‌లో చేరి, మాండియా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్, రైజోర్ దళ్ మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. దీంతో అహ్మద్‌కు సీట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన మార్చి 21న టీఎంసీలో చేరి, మాండియా నుంచి పోటీ చేసి గెలుపొందారు.
'మమతా దీదీ జిందాబాద్' అని అసెంబ్లీలో చేసిన నినాదాలను ఎమ్మెల్యే అహ్మద్ సమర్థించుకున్నారు. చాలా పార్టీలు తనను నిరాకరించిన క్లిష్ట దశలో రాజకీయంగా అండగా నిలిచిన ఆమెకు బహిరంగంగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అసోంలో టీఎంసీని బలోపేతం చేస్తామని, నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలో గట్టి అభ్యర్థిని పోటీలో నిలుపుతామని ఆయన తెలిపారు.