యూకేలో భారత సంతతి కుర్రాడి ఘనత... 23 ఏళ్లకే మేయర్

Tushar Kumar Becomes Youngest Indian Origin Mayor in UK
  • ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుషార్ కుమార్
  • రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరిన తుషార్ కుమార్
  • యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి
యూకేలో అత్యంత పిన్న వయస్కుడైన భారత సంతతి మేయర్‌గా 23 ఏళ్ళ తుషార్ కుమార్ చరిత్ర సృష్టించారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసిన తుషార్ గతవారం ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తుషార్ కుమార్ రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరారు. 20 ఏళ్ళ వయస్సులోనే 2023లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఎల్‌స్ట్రీ అండ్ బోర్హమ్‌వుడ్ టౌన్ కౌన్సిల్‌లో డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. తుషార్ నిబద్ధతను గుర్తించి ఇటీవల జరిగిన సమావేశంలో ఆయనను మేయర్‌గా ఎన్నుకున్నారు.

యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి తుషార్ కావడం గమనార్హం. తన నియామకంపై సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే తుషార్ ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. తుషార్ తల్లి ప్రవీణ్ రాణి కూడా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో ఆమె డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. తల్లి నుంచి స్ఫూర్తి పొంది తాను రాజకీయాల్లోకి వచ్చానని తుషార్ కుమార్ తెలిపారు.
Go Back to Shorts
Tushar Kumar
UK Mayor
Indian Origin Mayor
Elstree and Borehamwood
Kings College London

More Telugu News