గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం మోపింది: నారాయణ

Narayana Slams Previous Government for Rs 10 Lakh Crore Debt
  • నెల్లూరు దస్తగిరి నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణ
  • ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వ్యాఖ్య
  • రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దుతున్నామని వెల్లడి

నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. దస్తగిరి నగర్‌లో రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 


ఈ సందర్భంగా మాట్లాడుతూ... నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తీరుపై మండిపడుతూ.. గత పాలకులు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపడమే కాకుండా, పరిశ్రమలు తరలిపోయేలా చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

Go Back to Shorts
Narayana
Nellore
Andhra Pradesh
Debt
Development Works
CC Roads
Underground Drainage
Real Estate
AP Politics

More Telugu News