రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు నీట్-యూజీ పరీక్ష: విద్యార్థులూ... ఇవి గుర్తు పెట్టుకోండి!

NEET UG Exam Tomorrow Key Instructions for Students
  • పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
  • పరీక్ష కేంద్రాల వద్ద అమలులో బీఎన్ఎస్ఎస్‌లోని 163 సెక్షన్
  • 100 మీటర్ల దూరంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్ల మూసివేత
దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నీట్-యూజీ పరీక్షకు ఎన్టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నీట్ పరీక్ష నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్‌లోని 163 సెక్షన్ అమలులో ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరీక్ష కేంద్రాల వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఒక పబ్లిక్ నోటీసు విడుదల చేశారు. ఈ నోటీసు ప్రకారం, పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకన్నా ఎక్కుమంది గుమికూడటం నిషిద్ధం. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలి. పరీక్ష సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కోరారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షలమందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం మూసివేస్తారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థులు అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని ఎన్‌టీఏ ఒక అడ్వైజరీ జారీ చేసింది. అడ్మిట్ కార్డు, ఫొటో గ్రాప్ తడిచిపోకుండా ట్రాన్స్‌పరెంట్ పౌచ్‌లు ఉపయోగించాలని సూచించింది.
Advertisement
NEET UG
NEET Exam
NEET
Medical Entrance Exam
NTA
Cyberabad Police
Section 163
Exam Guidelines

More Telugu News