ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం... చంద్రబాబు శుభాకాంక్షలు
- ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం
- హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
- రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గిల్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు చరిత్రలో ఆమె తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. అమరావతిలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు.
ప్రమాణ స్వీకారానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, జస్టిస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టుకు తొలి మహిళా సీజేగా నియమితులైనందుకు ఆమెను అభినందించారు.
జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండీగఢ్. పంజాబ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె, 1990లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. పంజాబ్-హరియాణా హైకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో విస్తృతమైన అనుభవం గడించారు. 2014 మార్చిలో పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ లీసా గిల్ నాయకత్వంలో ఏపీ న్యాయవ్యవస్థకు కొత్త దిశానిర్దేశం లభిస్తుందని న్యాయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.