కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు

Sana Satish Babu Meets Kanna Lakshminarayana
  • కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ బాబు
  • అల్పాహార విందు అనంతరం కాసేపు ముచ్చటించిన కన్నా, సతీష్ బాబు
  • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు
తెలుగుదేశం పార్టీ నాయకుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులోని ఆయన నివాసంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఈరోజు ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. సతీష్ బాబును కన్నా లక్ష్మీనారాయణ ఆహ్వానించారు. అల్పాహార విందు అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.

ఈ కార్యక్రమంలో అరేటి అశోక్, తులసి ధర్మ చరణ్, చందనం శ్రీనివాస్, మాజీ మేయర్ కన్నా నాగరాజు, నాగేంద్ర, అసెంబ్లీ శ్రీనివాస్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం, కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Advertisement
Kanna Lakshminarayana
Sana Satish Babu
Telugu Desam Party
Sattenapalle
Andhra Pradesh Politics

More Telugu News